వీనస్ (శుక్రుడు) మీదకు ఇస్రో మిషన్..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తుంది.అంతరిక్షంలోకి ఉప గ్రహాలను పంపించి అక్కడ ఉన్న రహస్యాలను కనిపెట్టే ఇస్రో ఇప్పుడు మరో గ్రహం మీద దృష్టి పెట్టింది.

సౌత వ్యవస్థలో అత్యంత ఉష్ణ గ్రహంగా చెప్పుకునే వీనస్ (శుక్రుడు) మీదకు ఉప గ్రహాలను పంపించాలనిచూస్తున్నారు.2023 చివర్లో ఈ ప్రయోగాన్ని చేపట్టాలని అందుకు సంబందించిన ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు ఇస్రో చైర్మన్ సోమనాథ్.ఈ మిషన్ పై బుధవారం ఇస్రో లో చర్చలు జరిగాయని వెల్లడించారు.ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ.

చాలా తక్కువ సమయంలోనే శుక్ర గ్రహం మీదకు వెళ్లేలా మిషన్ ఏర్పాటు చేయడం భారత్ కు సాధ్యమని అన్నారు.ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన రిపోర్ట్ సిద్ధమైందని.నిధులు కూడా వచ్చాయని అన్నారు.2024 చివర్లో శుక్ర గ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ఇస్రో చైర్మన్ చెప్పారు.శుక్ర గ్రహంపైన కూడా జంతువులు ఉండే అనువైన ప్రదేశం ఉండేదని అయితే అక్కడ రాను రాను ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటుగా అక్కడ వాతావరణం విషపూరితంగా మారి సల్ఫూరిక్ యాసిడ్ మేఘాలు ఉంటాయని.

ఆ గ్రహం ఎందుకు అలా మారింది అన్న దానికి ఆధారాలు లేవని చెబుతున్నారు.నాసా కూడా శుక్ర గ్రహం మీద వ్యోమనౌకలను పంపించేందుకు సిద్ధమవుతుంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు