ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చాలా చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.ఇంకా చెప్పాలంటేనే వైసీపీలోనే అనేక మంతనాలు మల్లగుల్లాలు జరుగుతున్నాయని ఇప్పటికే ఎంపీ రఘురామ బయట పెడుతూనే ఉన్నారు.
ఏ నేత ఎందుకోసం మాట్లాడుతున్నారో ఆయన చెప్తున్నారు.ఇక సీఎం జగన్ విదేశీ టూర్లకు లేదంటే బయట రాష్ట్రాలకు వెళ్లినప్పుడల్లా మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయాల వేడిన రగుల్చుతారని చెప్పడం సంచలనం రేపుతోంది.
అయితే దీనివెనుక పెద్ద వ్యూహమే ఉందని రఘురామ గుట్టు విప్పుతున్నారు.
ఇక ఇప్పుడు కూడా జగన్ సిమ్లా పర్యటనలో ఉన్న క్రమంలో రాజకీయ నేతల దృష్టిని పూర్తిగా మళ్లించేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ వివాదాస్పద కామెంట్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇక ఇప్పుడే కాదే గతంలో కూడా ఇలాగే జగన్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఇలాగే అమరావతిపై చిచ్చురాజేసింది బొత్స నే అంటూ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.అయతే ఇప్పుడు మరోసారి రాజధాని మీద మాట్లాడుతూ అమరావతిని 29 గ్రామాల రాజధాని అని చెప్పడం దేనికి సంకేతం ఏంటంటూ ఆయన మండిపడుతున్నారు.

రాజధాని కోసం అన్ని గ్రామాలు అంతమంది రైతులు దాదాపుగా 33వేల ఎకరాలు ఇస్తే ఇప్పుడు ఏవేవో కారణాలు చెబుతూ వద్దనడం దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు.ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం ఏంటంటూ మండిపడుతున్నారు.ఏపీకి రాజధాని అనే విషయం వచ్చినప్పుడల్లా మూడు రాజధానులు అని స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటూ ఘాటు వ్యాఖ్యల చేశారు రఘురామ.ఇక ఇప్పుడు కర్నూలులో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర వాళ్లు ఎలా అంత దూరం వస్తారని, సరైన రవాణా సౌకర్యం కూడా లేదని కాబట్టి ఇలా వివాదాం రాజేసే వ్యాఖ్యలు మానుకోవాలంటూ సూచిస్తున్నారు.ఈ కామెంట్లపై బొత్స ఎలా రియాక్టు అవుతారో చూడాలి.