వాట్సప్ ఓపెన్ చేయకుండానే అందులో వచ్చిన మెసేజ్ లు ఎలా చూడాలంటే..?!

ప్రస్తుతం ప్రజాదారణ పొందిన మొబైల్ యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి.ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ మెసేజ్ చేసుకోవడం అలవాటు అయిపోయింది.

 How To See The Whatsapp Messages Without Opening Whatsapp, Whatsapp Tricks, What-TeluguStop.com

అయితే మీ వాట్సాప్‌ లో వచ్చిన ప్రతి మెసేజ్ చూడాలంటే మీరు తప్పకుండా వాట్సాప్ యాప్ ఓపెన్ చేయాలిసిందే కదా.కానీ ఇలా ప్రతిసారి మెసేజ్ ఓపెన్ చేయకుండానే మీకొచ్చిన మెసేజెస్ ను ఈజీగా చదివేయొచ్చు.అది ఎలానో ఇప్పుడు చూద్దాం.సాధారణంగా వాట్సాప్ ఓపెన్ చేయకుండానే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ ప్యానెల్ పై అన్ని మెసేజ్ లను కూడా చదివేయొచ్చు.

అలాగే మరొక పద్దతిలో కూడా మీరు యాప్ ఓపెన్ చేయకుండానే మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ చెక్ చేసుకోవచ్చు మరి.అది ఎలా అంటే.

ముందుగా మీ ఫోన్ లో గల హోం స్ర్కీన్ పై లాంగ్ ప్రెస్ చేయగానే మీ స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ మెనూపై ఒక పాపప్ మీకు కనిపిస్తుంది.అందులో గల విడ్జెట్స్ అనే బటన్ పై క్లిక్ చేయండి.

అలా క్లిక్ చేసిన వెంటనే మీకు చాలా షార్ట్ కట్స్ కనిపిస్తాయన్నమాట.అందులో మీకు వాట్సాప్ యాప్ షార్ట్ కట్ కూడా కనిపిస్తుంది.

అందులో మీకు వేర్వేరుగా వాట్సాప్ విడ్జెస్ కనిపిస్తాయి.వాటిలో 4 x 1 వాట్సాప్ విడ్జెట్ పై టచ్ చేసి హోల్డ్ చేసి అలానే ఉంచాలి.

ఇప్పుడు ఆ విడ్జిట్ ను మీ హోం స్ర్కీన్లలో డ్రాగ్ చేసి ఒకదానిలో పెట్టండి.అంతే మీ స్ర్కీన్ లోకి విడ్జిట్ యాడ్ అవుతుంది.

Telugu Whatsapp, Whatsapp Web, Whatsapp Widget, Widgets-Latest News - Telugu

ఆ విడ్జెట్ పై ఎక్కువ సేపు ప్రెస్ చేసి ఉంచితే అది పెద్దది అవుతుంది.అంతే మీ వాట్సాప్ కు ఏదైనా మెసేజ్ వస్తే మీరు ఓపెన్ చేయకుండానే మెసేజ్ చూడవచ్చు.ఇందులో ఇంకొక స్పెషల్ కూడా ఉంది అదేంటంటే.కొత్త మెసేజ్‌లే కాకుండా పాత మెసేజ్ లను కూడా చూడొచ్చు అన్నమాట.అయితే ఇదే ఫీచర్ వాట్సాప్ వెబ్, డెస్క్ టాప్ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది.మీకు వచ్చిన మెసేజ్ పై జస్ట్ మౌజ్ కర్సర్ పెడితే చాలు ఆ మెసేజ్ వివరాలు మీకు డిస్ ప్లే అవుతాయి.

అయితే కేవలం కొత్త మెసేజ్ లను మాత్రమే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది.ప్రీవియస్ చాట్ హిస్టరీ చూడాలంటే మీరు తప్పకుండా యాప్ ఓపెన్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube