ఈ మద్య తెలంగాణలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) వ్యవహారం ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో అందరికీ తెలిసిందే.పొంగులేటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనను బిఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారు సిఎం కేసిఆర్.
ఆ తరువాత నుంచి కేసిఆర్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు పొంగులేటి.కేసిఆర్ ను తండ్రిలా భావించానని, కానీ ఆయన తనను మోసం చేశారని.
ఇలా రకరకాలుగా కేసిఆర్ పై విమర్శలు చేటు పోలిటికల్ హిట్ పెంచుతున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ ను గద్దె దించడానికి అన్నివిధాలుగా కృషి చేస్తానని చెబుతూ.ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కూడా బిఆర్‌ఎస్( Brs part ) కు దక్కనివ్వనని సవాల్ చేస్తున్నారు.ఇలా పొంగులేటి వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు తావిస్తోంది.
అసలు పొంగులేటి ఈ స్థాయిలో తిరుగుబాటు చూపడానికి కారణం ఏంటి ? కేసిఆర్ ను ఢీ కొట్టే సత్తా పొంగులేటికి ఉందా ? అసలు పొంగులేటి వెనక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరు ? అనే రకరకాల ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక బలమైన నేతగా ఉన్నారు.ఆ జిల్లాలో ఇంచార్జ్ లను, అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారంటే.ఆ జిల్లాలో ఆయన బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
కాగా ఆయన బిఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తికరంగా మారింది.అయితే ఆయన బిజెపిలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పోలిటికల్ సర్కిల్స్ లో వినికిడి.
ఇకపోతే ఆయన కొత్త పార్టీ పెట్టె ఆలోచనలో కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే వీటన్నిపై త్వరలోనే సమాధానం ఇస్తానని చెబుతున్నారు పొంగులేటి.
అయితే పొంగులేటి వ్యవహారం కేసిఆర్ పై ఎంతమేర ప్రభావం చూపుతుందనేది కూడా ఆసక్తికరమైన ప్రశ్నే.

అయితే పొంగులేటి దూకుడు చూస్తుంటే.కేసిఆర్( Cm kcr ) ను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ స్థాయిలో దైర్యం ప్రదర్శించడానికి కారణం ఆయన వెనుకున్న బీజేపీ అధిష్టానమే అనేది కొందరి అభిప్రాయం.
ఏది ఏమైనప్పటికి పొంగులేటి చేస్తున్న సవాళ్ళు, కేసిఆర్ పై ఆయన వైఖరి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతున్నాయి.మరి రాబోయే రోజుల్లో పొంగులేటి ప్రభావం కేసిఆర్ పై ఎంతమేర ఉంటుందో చూడాలి.