ప్రభాస్ సలార్ 2 సినిమా సెట్స్ మీదకి వచ్చే అవకాశం ఉందా..?

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్( Prashanth Neil ) దర్శకత్వం లో వచ్చిన సలార్ సినిమా ( Salaar movie )750 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి భారీ సక్సెస్ గా నిలిచింది.

అయితే ప్రభాస్ కెరియర్ లో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన సినిమా అనే చెప్పాలి.

ఎందుకంటే బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి.ఇక వాటి నుంచి తప్పిస్తూ సలార్ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది.

మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా కూడా సీక్వెల్ రావాల్సి ఉంది.

అలాంటి సమయం లో ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయంలో క్లారిటీ లేకపోవడం వల్లే ఆ సినిమాని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తొందరగా సెట్స్ మీదకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇంకా ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు అయితే రాజాసాబ్ సినిమా( Rajasaab movie ) షూటింగ్ అయిపోయిన తర్వాత స్పిరిట్( Spirit ) కి సలార్ 2 రెండింటికి డేట్స్ ని కేటాయించబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.

Advertisement

మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.

ఎందుకంటే స్పిరిట్ మేకోవర్ వేరు, సలార్ 2 మేకోవర్ వేరు కాబట్టి ఒకేసారి ఈ రెండింటి మీద డేట్స్ ని కేటాయించడమనేది కుదరని విషయం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రభాస్ సలార్ 2 కంటే కూడా స్పిరిట్ సినిమాను హను రాఘవపూడి సినిమాలను సెట్స్ మీదకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ రెండు సినిమాలు కూడా చాలా డిఫరెంట్ సినిమాలు కావడం తో ఇవి ముగిసిన తర్వాత మళ్ళీ కల్కి 2, సలార్ 2 మీద తన డేట్స్ కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు