తెల్ల జుట్టుతో తెగ ఇబ్బంది పడుతున్నారా..?! అయితే వాటిని తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి..!

ఈ కాలంలో ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తెల్ల జుట్టుతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

సాధారణంగా తెల్ల జుట్టు రావడం అనేది వృద్ధాప్యానికి ఓ సంకేతంగా అర్ధం అన్నమాట.

అంటే వయసు పెరిగే కొద్ది మనలో ఓపిక ఎలా అయితే తగ్గుతుందో, నల్ల జుట్టు కూడా తెల్లగా మారడం అనేది సృష్టి దర్మం.కానీ ఇప్పుడు వయసుతో పని లేకుండా చిన్న వయసులోనే తెల్లజుట్టు వచ్చేస్తుంది.

ఇలా తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు.కానీ ఇలా చిన్న వయసులోనే జుట్టు నెరిసి పోతే చూడడానికి బాగోదు.

ఈ క్రమంలోనే తెల్ల జుట్టు నల్లగా మారడానికి మార్కెట్లో దొరికే జుట్టుకి దొరికే రంగులు, హెయిర్ డైస్ లాంటివి వాడుతున్నారు.కానీ.

Advertisement

అస్తమానం ఇలా జుట్టుకు రంగు వేయడం మంచిది కాదని నిపుణులు సలహా ఇస్తున్నారు.అందుకనే మీ ఇంట్లో దొరికే కొన్ని సహజ సిద్దమైన పదార్ధాలతో తెల్ల జుట్టు సమస్య తగ్గుముఖం పడుతుంది.

మరి ఆ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దామా.జుట్టు నలుపుగా మారడానికి ఉసిరికాయ పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది.

దీనినే మనం ఆమ్లా పౌడర్ అని కూడా అంటాము.ఒక జనాల్లో అరలీటరు కొబ్బరి నూనె తీసుకుని అందులో ఒక కప్పు ఆమ్లా పౌడర్ వేసి గరిటెతో ఒకసారి తిప్పి స్టవ్ వెలిగించి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు వేడి చేయండి.

ఈ నూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి.ఆ తరువాత వడకట్టి ఒక సీసాలో పోసుకుని జుట్టుకు రాస్తూ ఉండండి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఇలా రాయడం వలన కొన్ని రోజుల్లోనే మీ జుట్టు రంగు మారడం మీరు గమనించవచ్చు.అలాగే ఇంకొక హోమ్ రెమిడీ ఏంటో చూద్దాం.

Advertisement

కరివేపాకు గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.ఎందుకంటే కరివేపాకుని తాలింపులో మంచి సువాసన అనేది రావటానికి ఉపయోగిస్తూ ఉంటాము.అయితే కొంతమంది కరివేపాకుని ఆకే కదా అని తినకుండా ఏరి పారేస్తారు.

కానీ కరివేపాకు వలన ఎన్ని లాభాలో తెలిస్తే మీరే పారెయ్యకుండా తింటారు.కరివేపాకు తింటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

అలాగే తెల్ల జుట్టు పోయి జుట్టు నలుపు రంగులోకి రావాలంటే కొన్ని కరివేపాకు ఆకులను తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరికాయ పొడి, అలాగే రెండు టీ స్పూన్ల బ్రాహ్మీ పౌడర్‌ ను కలిపి మెత్తగా రుబ్బుకుని హెయిర్ మాస్క్‌ లాగా జుట్టుకు రాసుకుని ఒక పావుగంట లేదా అరగంట సేపు ఉంచుకోండి.ఆ తరువాత తల స్నానం చేయండి.

ఇలా వారానికి మూడు లేదా రెండు సార్లు చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.

అలాగే మన అందరికి ఇండిగో గురించి తెలిసే ఉంటుంది.ఈ ఇండిగో రంగును హెన్నాతో కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టు నల్లగా మారుతుంది.అలాగే మనకి మార్కెట్లో వివిధ రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి.

కాన వాటన్నిటిని పక్కన పెట్టి కొబ్బరి నూనెలో, నిమ్మరసం కలిపి రాసుకోవడం వలన జుట్టు నల్లగా మారుతుంది.అలాగే జుట్టు బ్లాక్ అవ్వడానికి బ్లాక్ టీ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి.

కొన్ని బ్లాక్ టీ ఆకులు తీసుకుని ఒక గంట సేపు గోరువెచ్చని నీటిలో నానబెట్టి తర్వాత మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.ఆ తరువాత అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని జుట్టుకి రాసుకోండి.

ఒక అరగంట పాటు అలాగే ఉంచుకుని ఆ తరువాత తలస్నానం చేయండి.పైన చెప్పిన పద్దతులను కంటిన్యూగా పాటిస్తూ ఉంటే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.

తాజా వార్తలు