ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ) లో అనే సంచలన వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపైన జగన్ పూర్తిగా కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా, మూడో విడత జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈ మేరకు భారీ స్థాయిలో ప్రక్షాళన చేపట్టారు.
కీలక నాయకులకు టిక్కెట్లు నిరాకరిస్తూ, కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు.కొంతమందికి వేరే నియోజకవర్గాల్లో అవకాశం ఇస్తున్నారు.
ఈ విధంగా భారీ స్థాయిలో ఈ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినా, పెద్దగా అసంతృప్తిలో అయితే ఆ పార్టీలో కనిపించడం లేదు .దీనికి కారణం వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు ఉండడమేనట.ఇప్పటికే జగన్ చేయించుకున్న సర్వేలలోనూ గెలుపునకు డోఖా ఉండదని, ఎమ్మెల్యేలపై మాత్రమే ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అభ్యర్థులను మారిస్తే మళ్లీ వైసీపీకి అధికారం దక్కడం ఖాయం అనే సర్వే నివేదికల తో జగన్( CM ys jagan ) ధీమాగా ఉన్నారట.అందుకే అంత ధీమాగా ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా, అధికారంలోకి మళ్ళీ తామే వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మళ్లీ మేమే గెలుస్తామని, ఈసారి గెలిచాక అంగన్వాడీల కోరికలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు.

ఇదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా గెలిచే పార్టీలపైనే ఒత్తిళ్లు ఉంటాయని, వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నారు.అయితే వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తుందనే ధీమా వెనుక కారణాలు చాలానే ఉన్నాయట.వైసిపి గెలిచిన మొదటి రోజు నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడం పైనే దృష్టి పెట్టింది.
ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందే విధంగా క్షేత్రస్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.నేరుగా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందిస్తోంది.ఒకే ఇంట్లో సామాజిక పెన్షన్, అమ్మఒడి, మహిళలకు ప్రత్యేక పథకాలు, రైతులకు భరోసా( Rythu Bharosa ), డ్వాక్రా మహిళలకు రుణాలు,ఇలా వైసిపి పాలనలో ఏదో ఒక రూపంలో జనాలకు నేరుగా సొమ్ములు అందడం వంటివన్నీ ప్రజల్లో సానుకూలతను పెంచాయని గతంలో ఎప్పుడూ ఈ విధంగా సంక్షేమ పథకాలు తమకు అందలేదని ప్రజలు చర్చించుకోవడం వంటివన్నీ, సర్వేల ద్వారా జగన్ కు నివేదికలు అందడమే కారణమట.ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందనేది కేవలం టిడిపి అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం మాత్రమేనని, జనాలు మాత్రం మళ్లీ వైసిపి నే గెలిపించాలనే ధీమాతో ఉన్నారని జగన్ బలంగా నమ్ముతున్నారు.

మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంపై రాజకీయ ప్రత్యర్థులు అనేక విమర్శలు చేశారు.ఏపీ శ్రీలంక అవుతుందని, ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హడావుడి చేశాయి .అయితే ఇప్పుడు వైసిపిని మించి ఉండేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెబుతూ ఉండడం, ప్రస్తుతం అమలవుతున్న పథకాలనే యధతంగా కొనసాగిస్తామని టీడీపి , జనసేన పార్టీలు హామీలు ఇస్తుండడం ఇవన్నీ తమకు మేలు చేసేవే అనే ధీమాలో వైసీపీ ఉంది.