బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ కు దడ మొదలైందన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై భయం ఎందుకని ప్రశ్నించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు బినామీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.ఈ క్రమంలోనే కాళేశ్వరంపై కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
కేసీఆర్ ను కిషన్ రెడ్డి కాపాడుతున్నారని పేర్కొన్నారు.కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు.
భూ కబ్జాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అలాగే గ్యారెంటీలపై దరఖాస్తులు స్వీకరించామన్న ఆయన గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని తెలిపారు.







