S.P. Bala Subramanyam: ఎస్పీ బాలసుబ్రమణ్యం పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆయనకు చెల్లెలవుతుందా..?

సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం (Singer S.P.Bala Subramanyam) తన 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 11 భాషల్లో ఏకంగా 40 వేలకు పైగా పాటలు పాడారు.

అలాగే 40 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు.

అలాంటి ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ వంటి భాషల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన సింగర్.కేవలం పాటలు మాత్రమే కాకుండా నటుడిగా అలాగే వ్యాఖ్యాతగా కూడా చేసేవారు.

అలాగే పాడుతా తీయగా (Paadutha Theeyaga ) అనే షో ద్వారా ఎంతోమంది యంగ్ జనరేషన్ కి సింగర్లుగా అవకాశం ఇచ్చారు.ఇక అలాంటి బాలసుబ్రమణ్యం సావిత్రి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే వీరి పెళ్లి సమయంలో కొన్ని అనూహ్య సంఘటనలు ఎదురయ్యాయట.ఎ స్పీ బాలసుబ్రమణ్యం మద్రాస్ (Madras) లో సినిమాల్లో అవకాశాల కోసం రూమ్ రెంట్ తీసుకొని అవకాశాలు వెతుక్కునేవారట.

Advertisement
Is Sp Balasubramanyams Married Girl His Younger Sister-S.P. Bala Subramanyam: �

ఇక అలా జరుగుతున్న సమయంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆ రూమ్ రెంట్ ఓనర్ కూతురు అయిన సావిత్రితో ప్రేమలో పడ్డారు.ఇక వీరి ప్రేమ సావిత్రి తల్లిదండ్రులకు తెలియడంతో ఎస్పీ బాలసుబ్రమణ్యం తల్లిదండ్రులను పిలిపించి ఇద్దరు మనసులు కలవడంతో పెద్దవాళ్లు కూడా చేసేదేమీ లేక పెళ్లికి ఒప్పుకున్నారట.

Is Sp Balasubramanyams Married Girl His Younger Sister

కానీ పెళ్లి చేసే సమయంలో జాతకాలు చూయిద్దామని ఒక జ్యోతిష్యుడికి వీరి జాతకాలు చూపించడంతో ఇద్దరి గోత్రం ఒకటే కావడంతో వరుసకు అన్నా చెల్లెలు అవుతారని జ్యోతిష్యుడు చెప్పారట.ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరు కుటుంబాలు వీరి పెళ్లి చేయడం అసంభవం అని ఇద్దర్ని విడదీశారట.కానీ వీళ్లు మాత్రం అస్సలు ఒప్పుకోలేదట.

ఇక ఇక్కడే ఉంటే వీళ్ళిద్దరూ ఎక్కడ పెళ్లి చేసుకుంటారో అని భయపడి సావిత్రి (Savitri) ని ఇంటికి దూరంగా బెంగళూరులో వాళ్ళ బంధువుల ఇంటికి పంపించారట.

Is Sp Balasubramanyams Married Girl His Younger Sister

కానీ ఎస్పీ బాలసుబ్రమణ్యం (S.P.Bala Subramanyam) మాత్రం స్నేహితుల ద్వారా ఆమె ఎక్కడ ఉందో అడ్రస్ తెలుసుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొని పెళ్లికి అన్ని రెడీ చేసుకుని సావిత్రిని తీసుకొని వెళ్లి సింహాచలం అప్పన్న స్వామి గుడిలో మూడు ముళ్ళు వేశారట.ఇక ఈ విషయం తెలిసి పరుగు పరుగున వచ్చిన ఇరు కుటుంబాలు అప్పటికే పెళ్లి జరిగిపోవడంతో చేసేదేమీ లేక యాక్సెప్ట్ చేశారట.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
డబ్బు కోసమే రోడ్డుపై డాన్స్ చేశాను.... షాకింగ్ విషయాలు బయటపెట్టిన నటి వరలక్ష్మి!

ఇలా ఎస్ పి బాలసుబ్రమణ్యంకి సావిత్రి వరుసకి చెల్లెలు అవుతుంది అని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు