రాముడే రావణాసురిడి భార్య మండోదరికి రెండో పెళ్లి చేశాడా...?

మహా కావ్యమైన రామాయణం ఒకరి కడుపున పుట్టక పోయినప్పటికీ రామలక్ష్మణుల మరియు భరత శత్రుఘ్నులు అన్నదమ్ముల మైత్రి మరియు భార్య భర్తల బంధం గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది.

అయితే ఈ రామాయణ కావ్యంలో రావణాసురుడు మరణించిన తర్వాత అతడి భార్య మండోదరి ఏమైంది.? ఎలా మరణించిందనే విషయాలు గురించి మాత్రం ఇప్పటికీ చాలా మందికి తెలియదు.ఇప్పుడు ఆమె గురించి పలు విషయాలను తెలుసుకుందాం.

శివుడికి పరమభక్తుడైన రావణాసురుడు మండోదరిని మనసు పడి పెళ్లి చేసుకున్నాడు.కానీ తన చెల్లెలు సూర్పణక కారణంగా సీతను చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని అపహరించి అశోక వనంలో ఉంచుతాడు.

అయితే రావణుడు బలవంతంగా సీతను అపహరించినప్పటికీ ఆమెను ఇష్టం లేకుండా ముట్టుకో లేదని చాలా మంది డైలాగులు చెబుతుంటారు.కానీ అసలు విషయం ఏమిటంటే అప్పటికే రావణాసురుడు ఇష్టం లేకుండా ఏ ఆడపిల్లనయినా తాకితే అతడి తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం ఉంటుంది.

అందువల్లనే రావణాసురుడు ఎవరిపైనా బలత్కారం చేయడానికి సాహసించడు.అయితే మందోదరి మాత్రం మహా పతివ్రతా ఇల్లాలు.

Advertisement

అలాగే రాముడు రావణాసురుడిని వధించిన తర్వాత లంక రాజ్యాన్ని కొంతకాలం పాటూ మందోదరి పరిపాలిస్తుంది.ఈ క్రమంలో రాముడు విభీషణుడుని పెళ్లి చేసుకోమని ఇచ్చిన సలహా మేరకు మందోదరి విభీషణుడిని పెళ్లి చేసుకుంటుంది.

కానీ ఈ పెళ్లి కేవలం లోక కల్యాణార్థం మాత్రమే జరుగుతుందని అలాగే మందోదరి ని కన్న తల్లిలా భావించే విభీషణుడు కేవలం రాజ్య పట్టాభిషేకం కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నట్లు పలు పురాణాలలో చెప్పబడింది.అయితే పెళ్లయిన తర్వాత మందోదరి ఎలాంటి శారీరక సంబంధం లేకుండా పర్వతాలకు వెళ్ళి పోయి నిరాడంబర జీవితం గడుపుతూ తపస్సులో నిమగ్నమై మరణించిందని రామాయణం చివరి కావ్యంలో వివరించబడింది.

నోట్ : ఇది కేవలం ఇంటర్నెట్ మరియు ఇతర మాధ్యమాలలో తెలిపిన సమాచారం ఆధారంగానే వ్రాయబడింది.ఇందులో ఎలాంటి మత విద్వేషాలకు మరియు మనోభావాలను రెచ్చగొట్టే విషయాలకు తావు లేదు.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు