పుర ఎన్నికల్లో సత్తా చాటితే టీఆర్ఎస్ జోరు ఆపడం కష్టమేనా?

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి టీఆర్ఎస్ అన్ని రకాల ఎన్నికలలో ప్రజల మద్దతు పొందుతూ ఒక దుబ్బాక, గ్రేటర్ లో కొన్ని సీట్లు తగ్గడం తప్ప అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించిందనే చెప్పవచ్చు.

అయితే అప్పటి నుండి ఇక టీఆర్ఎస్ ను ఏ పార్టీ ఓడించలేక పోయింది.

అయితే ఇక ఆ తరువాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగినా ఇంకా ఎన్నికలో గెలుపుపై ఇంకా స్పష్టత రాలేదు.అయితే ప్రస్తుతం పుర ఎన్నికలు జరుగుతున్న వేళ అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి.

ఇక ఎవరికి వారు తామే గెలుస్తామని భీంకారాలు పలుకుతున్నాయి.కాని ఇప్పటివరకు ఉన్న చరిత్ర చూసుకుంటే పుర ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువగా మైలేజీ దక్కే అవకాశం ఉంది.

అయితే ఇప్పటి వరకు ఉన్న అన్ని ఎన్నికల్లో ఎక్కువ శాతం టీఆర్ఎస్ గెలిచిన చరిత్ర ఉన్న పరిస్థితులలో మరల టీఆర్ఎస్ గెలిస్తే ప్రజల్లో టీఆర్ఎస్ మరింత బలపడే అవకాశం ఉంది.ఇక ఇంకేదైనా రెండు ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెడితే మరల జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే అయ్యే అవకాశం ఉంది.

Advertisement

మరి కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతుందా లేదా అని తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు