తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువగా పొగిడితే ప్రమాదమా..

ప్రస్తుత సమాజంలోని కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు.వారు చేసిన చిన్న పనులకి వారిని ఎక్కువగా మెచ్చుకుంటున్నారు.

అయితే చిన్నపిల్లలని పదేపదే పొగడడం వల్ల వారిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని చైల్డ్ సైకాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎందుకంటే ఎక్కువగా పిల్లలను ప్రశంసించడం వల్ల ప్రాణాంతకమే కాకుండా వేధింపులకు గురయ్యేలా చేస్తుందని చెబుతున్నారు.

అతిగా పొగిడితే పిల్లలు కొన్ని సమయాల్లో కష్టమైనా పరిస్థితులను ఎదురుకోలేరని కొన్ని పరిశోధనలలో తెలిసింది.ఈ పరిశోధనలలో పాల్గొన్న 85% మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రశంసించడం వల్ల వారు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం పై ఆసక్తి చూపిస్తారు.

స్కూల్లో పిల్లలు బాగా చదవడానికి ఈ ప్రశంసలు ఎంతగానో ఉపయోగపడతాయి.కానీ అతిగా పొగిడితే మాత్రం అది వారిపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది.

Advertisement

ఆరోగ్యకరమైన ప్రశంసకు, అతిగా పొగడడానికి మధ్య ఉన్న బేధాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే చాలా మంచిది.అలా అర్థం చేసుకున్నప్పుడు మితిమీరిన ప్రశంసల వల్ల పిల్లలపై పడే దుష్ప్రభావం నుంచి వారిని కాపాడుకోవచ్చు.

ఏదైనా పనిని సాధించడంలో పిల్లల కృషిని కచ్చితంగా ప్రశంసించి తీరాల్సిందే.చిన్నపిల్లలను ఏ చిన్న పని చేసినా ప్రశంసించ కూడదు.

మీ పిల్లలు గొప్ప పని చేసినప్పుడే ప్రశంసించాలి.సవాళ్ళను ఎదుర్కునే ధైర్యాన్ని పిల్లలకు ఇవ్వాలి.

పిల్లలను అతిగా పొగడడం వల్ల అనేక సమస్యలు రావచ్చు.చిన్నపిల్లలను మీ ఆలోచనలకు అనుగుణంగా వారిని మార్చడానికి ప్రశంస ఉపయోగపడుతుంది.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

అంటే పిల్లలు ఎప్పుడైతే పెద్దల అంగీకారం కోసం ఎదురు చూస్తారో అప్పటివరకు మాత్రమే ఈ పద్దతి పనికొస్తుంది.కానీ, అతిగా పొగడడం వల్ల పిల్లలు ప్రతిసారి తల్లిదండ్రులపై ఆధారపడవలసి వస్తుంది.ఈ పద్ధతి వారి మానసిక ఎదుగుదలకు అస్సలు మంచిది కాదు.

Advertisement

తరచూ పిల్లల్ని మీరు ప్రశంసిస్తూ ఉంటే ప్రతి దానికి వారు ప్రశంసించాలని చూస్తూ ఉంటారు.తమదైన నిర్ణయం ఇలాంటి పిల్లలు అస్సలు తీసుకోలేరు.

అందుకే ప్రశంసించే ముందు ఆలోచించడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.

తాజా వార్తలు