తన పెట్ తో బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన చరణ్.. కొత్త లుక్ వైరల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ఈ సినిమా ఘన విజయం అవడంతో ఈయన క్రేజ్ పాన్ ఇండియాను సైతం దాటి హాలీవుడ్ చేరిపోయింది.ఇక ఇప్పుడు చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ తో తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసాడు.RC15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగి పోయాయి.

 Ram Charan's New Look Attracts , Rc15 , Ram Charan , Director Shankar, viral Ph-TeluguStop.com

మెగా ఫ్యాన్స్ కూడా RC15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.

ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా 60 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.మిగిలిన షూట్ స్టార్ట్ చేయకముందు కొంత కాలం ఈ సినిమాకు గ్యాప్ ఇచ్చారు.

నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ కొత్త లుక్ లోకి మారిపోయాడు.ఈ సినిమాలో చరణ్ మూడు గెటప్స్ లో కనిపిస్తాడు అంటూ ఇప్పటికే వార్తలు వచ్చిన నేపథ్యంలో మరో కొత్త లుక్ లోకి చరణ్ మారిపోయాడు.

తాజాగా రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పిక్ షేర్ చేసాడు.ఈ పిక్ లో చరణ్ లుక్ కు అంతా ఫిదా అవుతున్నారు.

మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు.

ఇక ఈ ఫొటోలో మరొక దృశ్యం కూడా బాగా ఆకట్టు కుంటుంది.చరణ్ ఎంతగానో ఇష్టపడే తన పెట్ రైమ్ తో దిగిన ఫోటో షేర్ చేసాడు.ఈ ఫోటోలో చరణ్ తన జాకెట్ లో పెట్టుకుని మరీ తన పెట్ తో ఫోటో దిగాడు.

ఈ బ్యూటిఫుల్ ఫోటో బాగా ఆకట్టు కుంటుంది.ఇక త్వరలోనే స్టార్ట్ కాబోతున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం చరణ్ ఈ లుక్ లోకి మారినట్టు మెగా ఫ్యాన్స్ చర్చించు కుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube