రాజకీయ పార్టీ భవనాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించడం కరెక్టేనా?

రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలు కొనసాగించాలంటే శాశ్వత భవనాలు నిర్మించుకోవడం అవసరమే.

కానీ రాజకీయ పార్టీల భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను వినియోగించుకుంటున్న పరిస్థితులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నాయి.

నిజానికి రాజకీయ పార్టీలకు ప్రభుత్వ స్ధలాలు కేటాయించాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ప్రభుత్వ భూమి అంటే ప్రజల ఆస్తితో సమానం.

ప్రజల ఆస్తి ప్రజలకే దక్కాలి.కానీ ప్రైవేటు వ్యక్తులకు లేదా రాజకీయ పార్టీలకు సొంతం చేయడానికి ఎలాంటి హక్కులు లేవు.

రాజకీయ పార్టీల ఆస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు చెందవు.న్యాయపరంగా అలాంటి ఆస్తులను జాతీయం చేయాలని ప్రజలు అడిగే హక్కు కూడా ఉండదు.

Advertisement

అందుకే రాజకీయ పార్టీల భవనాలకు ప్రైవేట్ ఆస్తులనే ఎంచుకోవాలి.పరిశ్రమలు, ఫ్యాక్టరీల ఏర్పాటులో ప్రైవేటు సంస్ధలకు ప్రభుత్వ భూములు ధారాదత్తం చేసినా అర్థముంటుంది.

కానీ పార్టీల భవనాల నిర్మాణానికి ప్రభుత్వ ఆస్తులను తీసుకోవడం క్షమించరాని తప్పు అవుతుంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అటు వైసీపీ, ఇటు టీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా కట్టబెడుతున్న దాఖలాలు కోకోల్లలుగా కనిపిస్తున్నాయి.గజం ఖరీదు లక్షల్లో ఉన్న ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం 100 రూపాయలకే కేటాయించేసింది.ఇదే సమయంలో ప్రతిపక్షాలకు మాత్రం గజం స్ధలం కూడా కేటాయించలేదు.

తమ పార్టీల కార్యాలయాలు నిర్మించుకునేందుకు స్ధలాలు కేటాయించాలని కలెక్టర్లకు, ప్రభుత్వానికి ప్రతిపక్షాల నేతలు ఎన్ని లేఖలు రాస్తున్నా ఉపయోగం మాత్రం కనిపించడం లేదు.అటు ఏపీలోనూ వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం కొన్నిచోట్ల భూముల కేటాయింపులు జరిగిపోయాయి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

నగరాల నడిబొడ్డున వివిధ ప్రజోపయోగ కార్యక్రమాల కోసం గతంలో కేటాయించిన స్థలాలు కూడా కేటాయింపుల్లో ఉన్నాయి.దీంతో ప్రతిపక్షాలు న్యాయపరంగా తేల్చుకుందామని ఈ అంశంపై ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

Advertisement

తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఏకంగా కేసీఆర్ సర్కారుకు నోటీసులు జారీచేసింది.దీంతో పార్టీ భవనాలకు ప్రభుత్వ భూముల కేటాయింపులపై టీఆర్ఎస్ పార్టీ కోర్టు విచారణలో ఎలాంటి సమాధానం ఇస్తుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

తాజా వార్తలు