వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నా..: బాబు మోహన్

సినీ నటుడు, బీజేపీ నేత బాబు మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు.తనపై కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం అని ప్రచారం చేస్తున్నారంటూ బాబు మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తనకు టికెట్ వస్తుందో రాదో తరువాత విషయమన్న ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని చెప్పారని తెలుస్తోంది.

అయితే తన కొడుకుకు టికెట్ ఇస్తారో, మరొకరికి టికెట్ ఇస్తారోనన్నది బీజేపీ అధిష్టానం ఇష్టమని పేర్కొన్నారని సమాచారం.తాను ఫోన్ చేస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ అటెండ్ చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలోనే నేతల స్పందనను బట్టి బీజేపీలో కొనసాగడంపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

Advertisement
ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు