కుటుంబ పార్టీల రాగాన్నే వల్లె వేస్తున్న బీజేపీ.. దీంతో ప్రయోజనం ఉంటుందా?

కుటుంబ రాజకీయాలు. మన దేశంలో చాలా కామన్ విషయం.

చాలా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు, దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వారసత్త్వ రాజకీయాలను నడిపిస్తున్నాయి.

వారసత్త్వ రాజకీయాల మకిలి అంటని రాజకీయ పార్టీ ఏదైనా ఉందా అంటే అది కమలనాధుల పార్టీయే అని గంటాపథంగా చెప్పొచ్చు.

ఇప్పుడు ఇదే అంశాన్ని కాషాయవాదులు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు.ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు.

కానీ అది అంత ఈజీ అవుతుందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు? అసలు కుటుంబ రాజకీయాలు దేశవాసులకు కొత్త కాదు.ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.

Advertisement

ప్రజలు అది కుటుంబ పార్టీయా లేక కాదా అనే విషయం పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు.ఆ పార్టీలు గెలిస్తే మనకు ప్రయోజనం చేకూరుతుందా? లేదా? అనే విషయాల గురించే తెగ పట్టించుకుంటున్నారు.కానీ ఇటువంటి తరుణంలో బీజేపీ పార్టీ మాత్రం కుటుంబపాలన రాగాన్ని అందుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ.ఏపీలో ఉన్న వైసీపీ, టీడీపీ రెండూ కుటుంబ పార్టీలే అని వాటికి ప్రత్యామ్నాయం బీజేపీయే అని ఆయన పేర్కొన్నారు.

తప్పకుండా ఏపీలో అధికారంలోకి వచ్చి తీరుతామని శపథం చేశారు.

అంతా బాగానే ఉంది కానీ బీజేపీకి మంచి మైలేజ్ అందుకునే చాన్స్ మిస్ చేసుకుందనే అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.ఏపీ పునర్విభజన జరిగినపుడు ఏపీలో ఉన్న పరిస్థితులు చాలా దారుణం అని అటువంటి సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే పరిస్థితులు వేరేలా ఉండేవని కామెంట్ చేస్తున్నారు.అటువంటి సువర్ణావకాశాన్ని బీజేపీ మిస్ చేసుకుందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.

పవన్ ప్రమాణ స్వీకారానికి లావణ్య త్రిపాఠి హాజరు కాకపోవడానికి కారణాలివేనా?
సంతానం లేక ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఒక్కసారి ఆలయానికి వెళితే చాలు..!

ఇప్పుడు ఈ డైలాగులు చెప్పడం వల్ల ఉపయోగం లేదని పలువురు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు