వాహనదారులకు అలెర్ట్.. ఈ డాక్యుమెంట్ లేకపోతే భారీ నష్టం!

వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే భారీ నష్టం చూడాల్సి వస్తుంది.

మోటార్ భీమా పాలిసీలను రెన్యువల్‌ చేసే సమయం లో పాలసీదారుల నుంచి చెల్లుబాటులో ఉండే (పీయూసీ) పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ సర్టిఫికెట్ అడగాలని అవి లేకపోతే బీమా పాలసీని రెన్యువల్‌ చేయకూడదని సాధారణ బీమా కంపెనీలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) తాజాగా ఆదేశించింది.ఈ మేరకు ఒక సరిక్యులేషన్ ను కూడా ఐఆర్‌డీఏఐ జారీ చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.గతంలోనే పొల్యూషన్ చెక్ సర్టిఫికెట్ లేకపోతే భీమా పాలసీని రెన్యువల్ చెయ్యకూడదని సుప్రీం కోర్టు బీమా కంపెనీల కు ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ ఆర్డర్ ను ఎవరు అమలు చేయకపోగా దాన్ని మర్చిపోయారని తెలుస్తుంది.అంతేకాదు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో సుప్రీం కోర్టు ఆదేశాల అమలు స్థాయి పట్ల కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆందోళన వ్యక్తం చేసినట్టు ఐఆర్‌డీఏఐ పేర్కొంది.

Advertisement

ఈ విషయంపై బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ స్పందిస్తూ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ రీజియన్‌ను దృష్టిలో పెట్టుకొని బీమాను రెన్యూవల్ సమయంలో పీయూసీ సర్టిఫికెట్‌ ఉండాలన్న ఆదేశాలు తప్పకుండ పాటించేలా చెయ్యాలని ఐఆర్‌డీఏఐ తెలియజేసింది.అందుకే బీమా కోసం వెళ్లిన సమయంలో చెల్లుబాటులో ఉండే పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ సర్టిఫికెట్ ని తీసుకువెళ్లాలి.లేదంటే రెన్యూవల్ అవ్వదు.

అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)
Advertisement

తాజా వార్తలు