మంత్రికి కరోనా,ఇరాన్ లో

కరోనా వైరస్ పేరు చెప్పగానే అందరూ కూడా అలెర్ట్ అయిపోతారు.ఎందుకంటే ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తున్న వైరస్ కరోనా.

చైనా తో పాటు ప్రపంచ దేశాలు సైతం ఈ వైరస్ గురించి తెగ ఆందోళన చెందుతున్నారు.అయితే ఈ కరోనా వైరస్ మంత్రికి గారికి కూడా సోకినట్లు తెలుస్తుంది.

అయితే ఇక్కడకాదు కానీ ఇరాన్ లోని డిప్యూటీ ఆరోగ్య మంత్రి ఇరాజ్ హరిర్చి కి సోకినట్లు అధికారులు వెల్లడించారు.సోమవారం జ్వరం తో బాధపడుతున్న ఆయనకు కరోనా టెస్ట్ చేయడం తో పాజిటివ్ వచ్చింది అని మంగళవారం అధికారులు స్పష్టం చేశారు.

దీనితో ఆయన మంగళవారం నుంచి తనంతట తానె నిర్బంధంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.తనకు కరోనా సోకింది అంటి స్వయంగా మంత్రి కూడా ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.

Advertisement

అలానే కోవిడ్ సోకినట్లు తెలియగానే నేను బయటకు రాకూడదని నిర్ణయించుకొని ప్రస్తుతం వైద్యం తీసుకుంటున్నాను అంటూ తెలిపారు.అలానే ఈ వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా సూచించారు.

ప్రస్తుతం ఆయన పరిస్థితి సాధారణంగానే ఉందని తెలిపిన ఆయన,కొంచం అలసటగా ఉందంటూ పేర్కొన్నారు.మొత్తానికి మంత్రిగారికి కూడా ఈ కరోనా వైరస్ సోకడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది.ఈ కరోనా వైరస్ కారణంగా డ్రాగన్ దేశం అయిన చైనా లో దాదాపు 2వేల కు పైగా మృత్యుఘంటికలు మోగిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ప్రపంచ దేశాలు కూడా ఈ వైరస్ తో ఆందోళన చెందుతున్నారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు