జీవితంలో అన్నీ ఎదురుదెబ్బలు.. బలమైన కోరికతో ఐపీఎస్.. ఈ యువతి సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

లైఫ్ లో సక్సెస్ సాధించాలని భావించే వాళ్లకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి.

కొన్నిసార్లు ఆ సమస్యలు ఏ రేంజ్ లో ఉంటాయంటే జీవితం అంటే ఇన్ని ఇబ్బందులా అని కూడా అనిపిస్తుంది.

యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో( UPSC Civils Exam ) సక్సెస్ సాధించాలంటే సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.బలమైన సంకల్పం, పట్టుదలతో ముందడుగులు వేస్తే మాత్రమే యూపీఎస్సీ పరీక్షలో సత్తా చాటే అవకాశాలు ఉంటాయి.ఢిల్లీకి చెందిన అన్షికా జైన్( Anshika Jain ) తన లైఫ్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.5 సంవత్సరాల ప్రాయంలోనే అన్షికా జైన్ తల్లీదండ్రులను కోల్పోయారు.అమ్మమ్మ, మేనమామ దగ్గర పెరిగిన అన్షికా జైన్ వాళ్ల సపోర్ట్ తో ముందడుగులు వేశారు.

అన్షిక అమ్మమ్మ సివిల్ సర్వెంట్ కావాలని అనుకున్నా కాలేదు.అయితే అన్షిక మాత్రం కష్టపడి తన కలను నెరవేర్చుకున్నారు.

రాంజాస్ కాలేజ్ లో ఆమె ఎంకామ్ పూర్తి చేశారు.

Advertisement

ఆ సమయంలో అన్షికకు ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.ఐపీఎస్( IPS ) కావాలనే ఆలోచనతో జాబ్ ఆఫర్ ను సైతం ఆమె వదులుకున్నారు.2019లో అన్షిక అమ్మమ్మ మృతి చెందారు.ఆ సమయంలో అన్షిక బాధ అంతాఇంతా కాదు.

పట్టుదలతో అన్షిక ప్రిపరేషన్ ను కొనసాగించగా నాలుగుసార్లు ప్రయత్నించినా ఆశించిన ఫలితాలు దక్కలేదు.

ఐదో ప్రయత్నంలో 306వ ర్యాంక్ సాధించిన అన్షిక ఐపీఎస్( IPS Anshika ) కావాలనే కలను నెరవేర్చుకున్నారు.2023 సంవత్సరం జూన్ 5వ తేదీన అన్షిక వివాహం గ్రాండ్ గా జరిగింది.అన్షిక సక్సెస్ స్టోరీ( Anshika Success Story ) నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

తన సక్సెస్ లో వాసు జైన్ పాత్ర కూడా కొంతమేర ఉందని ఆమె చెబుతున్నారు.అన్షికా జైన్ రేయింబవళ్లు కష్టపడటం వల్లే ఈ స్థాయికి చేరుకున్నారని ఆమె సక్సెస్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో : మాజీ ప్రియుడి పెళ్లిలో ప్రియురాలు ఎంట్రీ.. చివరకు ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు