ఐపీఎల్ వేలానికి ముహూర్తం షురూ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 14 కి సంబంధించిన వేలంపాట చెన్నై లో ఫిబ్రవరి 18 వ తారీఖున జరగనున్నది.

ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు ట్విట్టర్ వేదికగా జనవరి 27 వ తారీఖున ప్రకటించారు.

అలెర్ట్ ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం.వేదిక చెన్నై" అని ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ పేజీ లో పోస్ట్ చేశారు.

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగే రెండవ టెస్ట్ మ్యాచ్ అనంతరం చెన్నై లో వేలం జరగనున్నది.అయితే ఐపీఎల్- 2021 లీగ్ వేలానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో వీక్షించవచ్చు.ఈసారి ఒక్క రోజు వ్యవధిలోనే పూర్తి కానున్న ఐపీఎల్ అక్షన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచెజీ రూ.53.2 కోట్లతో బరిలోకి దిగనున్నది.బెంగళూరు రూ.35.7 కోట్లు, రాజస్థాన్‌ రూ.34.85 కోట్లు, చెన్నై రూ.22.9 కోట్లు, ముంబయి రూ.15.35 కోట్లు, దిల్లీ 12.8 కోట్లు, కోల్‌కతా రూ.10.85 కోట్లు, సన్‌రైజర్స్‌ రూ.10.75 కోట్ల తో వేలం పాడనున్నాయి.

ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్, టాప్ బ్యాట్స్ మ్యాన్, స్ట్రాంగ్ ఫీల్డర్ అయిన స్టీవ్ స్మిత్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచెజీ నుంచి బయటకు రావడం తో ఇప్పుడు అతన్ని ఏ ఫ్రాంచెజీ కొనుగోలు చేస్తుంది అనే అంశం చర్చనీయాంశం అయింది.గ్లెన్ మాక్స్ వెల్ పంజాబ్ ఫ్రాంచెజీ ని వదులుకోవడం తో ఈసారి అతన్ని ఏ ఫ్రాంచైజీ ఎంత వేలం తో సొంతం చేసుకుంటుందో అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.వీరిద్దరితో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ లో మంచి పర్ఫామెన్స్ కనబరిచిన ఆటగాళ్లకు కూడా డిమాండ్ ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

ఇప్పటికే తమకు అక్కర్లేని ప్లేయర్లను ప్రకటించిన ఫ్రాంచైజీలు ఈసారి ఎలాగైనా 2-3 సీజన్లకు ఉపయోగపడే టాలెంటెడ్ ఆటగాళ్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి.

ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న భారతీయ రైలు..?
Advertisement

తాజా వార్తలు