ఐపీఎల్ 2021 సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు అసలు అచ్చిరాలేదని చెప్పాలి.ఇప్పటిదాకా పది మ్యాచ్ లు ఆడగా అందులో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది.
అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా సన్ రైజర్స్ నిష్క్రమించింది.ఇదిలా ఉంటే సోమవారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ ల డేవిడ్ వార్నర్ స్థానంలో జేసన్ రాయ్ తుది జట్టులోకి వచ్చి అదరగొట్టాడు.
ఇక అదే సమయంలో డేవిడ్ బాయ్ స్టేడియంలో కనిపించకపోవడం ఆరంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ను బాధపెట్టింది.ఇకపై ఆరెంజ్ జెర్సీ లో వార్నర్ ను చూస్తామో లేదో.
అంటూ కామెంట్ చేశారు.ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో వార్నర్ పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు.
మొదట అతడు కెప్టెన్సీ నుంచి వైదొలగగా.తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు.
ఇక కొద్ది రోజుల్లో మెగా ఆక్షన్ జరగనుండగా ఇకపై ఆరెంజ్ జెర్సీ లో చూడలేమని సన్ రైజర్స్ అభిమానులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే వార్నర్ తాజాగా ఓ నెటిజన్ కు ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తనను మళ్ళి ఎస్ఆర్ హెచ్ క్యాంప్ లో చూడలేరని.అయినా జట్టుకు సపోర్ట్ చేస్తూనే ఉండండి అని రిప్లై ఇచ్చాడు.
దీంతో ఎస్ఆర్ హెచ్ జట్టుకు వార్నర్ మొత్తానికి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది.అటు సన్ రైజర్స్ జుట్టు హెడ్ కోచ్ ట్రెవర్ డేవిస్ ఇంతవరకు ఆ(వార్నర్) అంశం గురించి ఆలోచించలేదు.

మెగా ఆక్షన్ తొందర్లోనే జరుగనుంది.త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.ఎన్నో ఏళ్లుగా వార్నర్ జట్టుకు ఎనలేని సేవలు అందించాడు.మా అందరికి కూడా అతడిపై గౌరవం ఉంది.ఈ మ్యాచ్ (రాజస్థాన్) కు ఆటగాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాం.అందుకే కొంతమంది హోటల్ కే పరిమితమయ్యారు.
అంటూ పేర్కొనడం ఈ వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తుంది.ఒక్క సీజన్ ఫెయిల్ అయితే ఛాంపియన్ ను ఇలా పక్కన పెట్టేస్తారా.? ఇన్నాళ్లుగా అతను చేసే సేవలు మర్చిపోయేరా.? అంటూ వార్నర్ ఫ్యాన్స్ ఫ్రాంచైజీ తీరును విమర్శిస్తున్నారు.కాగా.2016లో వార్నర్ సారధ్యంలోనే హైదరాబాద్ జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.