ఆ దేశాల్లో పరీక్షలు జరిగితే ఇంటర్నెట్ కట్.. ఎందుకంటే?

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది.సెకన్ల వ్యవధిలో సమాచారం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుతోంది.

అయితే కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లే టెక్నాలజీకి కూడా రెండు వైపులా పదును ఉంది.ముఖ్యంగా విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగించుకుని అనేక ప్రాంతాల్లో పరీక్షల్లో చీటింగ్ చేస్తున్నారు.

ఒక ప్రాంతంలో ప్రశ్నాపత్రం లీక్ అయితే సెకన్ల వ్యవధిలో ప్రశ్నాపత్రం ఇతర ప్రాంతాలకు చేరుతోంది.పరీక్షల్లో చీటింగ్ వల్ల ప్రతిభ గల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

దీంతో ఆఫ్రికాలోని పలు దేశాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ ప్రతిభ గల విద్యార్థులు నష్టపోకుండా చేస్తున్నాయి.

Advertisement

సాధారణంగా ఎక్కడైనా భద్రతాపరమైన సమస్యలు ఏర్పడినా, అల్లర్లు జరిగినా ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తుంటారని మనం వింటూ ఉంటాం.ఇతర ప్రాంతాలకు సమాచారం చేరకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటాయి.

ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో విద్యార్థులు టెక్నాలజీ సహాయంతో చీటింగ్ లకు పాల్పడుతుండటం, ప్రశ్నాపత్రాలు లీక్ కావడం లాంటి ఘటనలు జరగడంతో ఇంటర్నెట్ నిలిపివేస్తూ పరీక్షలు జరిగేలా పలు దేశాలు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. ఆఫ్రికాలోని సూడాన్ లో డిప్లొమా ఆఫ్ సెకండియర్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతుండగా అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను దేశవ్యాప్తంగా నిలిపివేసింది.

అయితే పరీక్షలు జరిగే కొన్ని గంటలు మాత్రమే ఇంటర్నెట్ నిలిపివేయడంతో ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.ఆఫ్రికాలోని అల్జీరియా దేశంలో కూడా ఈ నిబంధనలు అమలవుతున్నాయి.

ఇరాన్ తో పాటు మరికొన్ని దేశాల్లో కూడా ఈ తరహా నిబంధనలు అమలవుతున్నాయని సమాచారం.ఈ విషయం తెలిసిన కొందరు నెటిజన్లు మన దేశంలో కూడా జాతీయ పరీక్షలు జరిగే సమయంలో ఇంటర్నెట్ కట్ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు