అప్పట్లో ప్రేక్షకుడు శ్రీరాముడు అంటే ఎన్టీ రామారావు అని ఫిక్స్ అయిపోయారు.ఆ క్రమంలోనే శోభన్ బాబు ను రాముడి పాత్రకు ఎన్నుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది.
దర్శకుడు బాపు రూపొందించిన తొలి పౌరాణిక చిత్రం సంపూర్ణ రామాయణం.కమ్యూనిస్ట్ ఆరుద్ర, కామెడీ రైటర్ ముళ్లపూడి రమణ, కార్టూనిస్ట్ బాపు .రామాయణం సినిమా తీయడమా.అందులోనూ రాముడిగా శోభన్ బాబుని ఎన్నుకోవడమా హవ్వ అంటూ అప్పట్లో తెగ విమర్శలు వినిపించాయి.
దీనికి తోడుగా ఎన్టీఆర్ ఎప్పటినుంచో శ్రీరామ పట్టాభిషేకం సినిమాను తీయాలి అని సముద్రాల రాఘవాచార్య స్క్రిప్టు తయారు చేయించి మరి సిద్ధంగా ఉన్నారట.
బాపు, రమణ సినిమాను ప్రారంభించేముందు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పడంతో.
అప్పుడు ఎన్టీఆర్ నేను షూటింగ్ ప్రారంభిస్తే మీరు ఇబ్బంది పడతారని అన్నారట.అందుకు బాపు-రమణ సరే అని చెప్పి వచ్చేసారట.
ఆ తరువాత ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ఏకాగ్రతతో సినిమాను పూర్తి చేసారట.అప్పట్లో మందు లేకపోతే ఎస్.
వి.రంగారావుకి రోజు గడవ లేని పరిస్థితి.అలాంటిది అతను ఆరు నెలల పాటు మందు జోలికి పోకుండా నిష్టగా ఉంటూ రామాయణంలో రావణాసురుడు పాత్ర పోషించారట.
1972 మార్చి 16న సంపూర్ణ రామాయణం సినిమా విడుదల అయింది.కానీ కలెక్షన్స్ మాత్రం కాలేదు.ఈ సినిమా విడుదల అయ్యి రెండు వారాలు అవుతున్నా కూడా థియేటర్లలో అడపాదడపా మాత్రమే జనాలు కనిపించారు.
అయితే బయట వినిపిస్తున్న ఈ వార్తలకు భయపడిన శోభన్ బాబు ఇంట్లో నుంచి బయటకు కూడా వచ్చేవారు కాదట.కానీ నిదానంగా సినిమా బాగుందని వార్తలు వినిపించడంతో థియేటర్లు పట్టనంత జనం వచ్చారట.
సినిమా చూడడమే మానేసిన వాళ్లు సైతం ఈ సినిమాను చూడడానికి థియేటర్లకు వచ్చారట.