పెళ్లయిన వ్యక్తితో బిగ్ బాస్ బ్యూటీ ప్రేమ ప్రయాణం.. ఇదేం మాయ రోగం అంటున్న నేటిజన్స్?

బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో ఎంతో మంది కంటెస్టెంట్లు పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు ఇలా బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో నటి రతిక ( Rathika ) ఒకరు.ఈమె పలు సినిమాలలో ఇదివరకు నటించారు ఇక ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సమయంలో అందరి చూపు ఈమె పైనే పడింది ఈమె గురించి నాగార్జున అంత గొప్పగా చెప్పడంతో కచ్చితంగా ఈమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి కొనసాగుతుంది అని అందరూ భావించారు కానీ ఈమె హౌస్ లోకి వెళ్ళిన తర్వాత పెద్దగా టాస్కులలో పాల్గొనలేదని చెప్పాలి.

రతికకు మెమరీ పవర్ ఉన్నప్పటికీ ఫిజికల్ టాస్కులలో మాత్రం పెద్దగా ఆట తీరును కనబరచలేకపోయారు.అదే విధంగా తన ప్రయోజనం కోసం ఇతర కంటెస్టెంట్లను వాడుకున్న తీరు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు దీంతో ఈమెను మూడు వారాల తర్వాత హౌస్ నుంచి బయటకు పంపించారు ఇలా బయటకు పంపించిన అనంతరం తిరిగి మరో మూడు వారాలకి ఈమె హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.ఒకసారి బయటకు వెళ్లి వచ్చిన తర్వాత అయినా తన ఆట తీరం మారుతుంది అని అందరూ భావించారు కానీ మొదటి కంటే చాలా ఘోరంగా ఈమె హౌస్ లోకి కొనసాగడంతో చివరికి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

రతిక బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు స్పై బ్యాచ్ అలాగే స్పా మ్యాచ్ తో కూడా క్లోజ్ గా మూవ్ అయ్యారు.ఇక అమర్ ( Amar ) తో ఈమెకు చిన్నచిన్న గొడవలు కావడంతో శివాజీ ( Shivaji ) బ్యాచ్ కు వెళ్లి అక్కడ వారితో కూడా చనవుగా ఉన్నారు కానీ ఈమెకు మాత్రం పెద్దగా ఓట్లు పడకపోవడంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత రతీక పెద్దగా ఎవరితోనూ కలవలేదని చెప్పాలి.

ముఖ్యంగా శివాజీ బ్యాచ్ తో ఈమె అసలు కలవలేదు కానీ అమర్ తో కలిసి దిగినటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీంతో ఈమె గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

గతంలో రాహుల్ తో కలిసి ప్రేమ ప్రయాణం కొనసాగించినటువంటి ఈమె తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు అయితే తాజాగా అమర్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.కొన్ని స్నేహ బంధాలు చాలా అరుదైనవి.అలాంటి స్నేహ బంధమే మా ఇద్దరి మధ్య ఉంది.

మా కొత్త ప్రయాణం నేటితో ఆరంభం అంటూ పెట్టిన ఒక్క పోస్ట్ తెగ వైరల్ గా మారింది.కొత్త ప్రయాణం ఆరంభం అనడం ఏమిటి? అది కూడా పెళ్ళైన వ్యక్తితో అంటూ పెద్ద ఎత్తున ఈమె వ్యవహార శైలి పై కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు