పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వద్ద అప్పు చేశారా.. రామ్ చరణ్ కు ఎంత బాకీనో తెలుసా?

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతున్న పేరు.

ఈయన ఇన్ని రోజులు నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

కానీ ఇప్పుడు మాత్రం రాజకీయ నాయకుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.జనసేన పార్టీ( Janasena Party ) ని స్థాపించిన తర్వాత మొదటిసారి ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు అయితే పొత్తులో భాగంగా ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఈయన ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

అదే విధంగా ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు.ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా ఇలాంటి మంచి సక్సెస్ అందుకోవడంతో మెగా కుటుంబ సభ్యులకు కూడా ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎన్నో వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.ఇటీవల సుస్మిత తన బాబాయ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు .ఈ క్రమంలోనే మరో విషయం వైరల్ అవుతుంది.పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వద్ద పెద్ద ఎత్తున డబ్బు అప్పు తీసుకున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

Advertisement

అసలు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వద్ద అప్పు తీసుకోవడం ఏంటి ఏం జరిగింది అనే విషయానికి వస్తే.

పవన్ కళ్యాణ్ రామ్ చరణ్( Ram Charan ) వద్ద అప్పు తీసుకుంది ఇప్పుడు కాదు ఆయన సినిమాలలోకి రాకముందు.పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రాకముందు తన పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీ తనకు సరిపోయేది కాదట.ఎప్పుడైనా బయటికి వెళ్లాలి అనిపిస్తే తన వద్ద డబ్బులు లేకపోవడంతో చరణ్ కు చిరంజీవి( Chiranjeevi ) ఇచ్చిన పాకెట్ మనీని అడిగి తీసుకునే వారు.

ఇక చరణ్ చిన్నపిల్లాడు కావడంతో నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను, వడ్డీ వేసి ఇస్తాను అంటూ తన వద్ద ఉన్న డబ్బులను తీసుకొని వెళ్ళిపోయే వాడిని అంటూ ఒక సందర్భంలో స్వయంగా పవన్ కళ్యాణ్, చరణ్ ఇద్దరు కూడా తెలియజేశారు.ఇలా పాకెట్ మనీ కోసం డబ్బులు తీసుకునే స్థాయి నుంచి నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి పవన్ చేరుకోవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కల్కి మూవీలో కృష్ణుడి పాత్రను పోషించింది ఇతనే.. ఆ తమిళ నటుడికి ఛాన్స్ దక్కిందా?
Advertisement

తాజా వార్తలు