బ్రహ్మానందంకు సినిమాల్లో ఆఫర్లు రావడానికి కారణమైన షో ఏంటో తెలుసా?

తెలుగులో కమెడియన్ గా దశాబ్దాల పాటు సినిమాల్లో నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బ్రహ్మానందం కడుపుబ్బా నవ్వించారనే సంగతి తెలిసిందే.2010 సంవత్సరంలో బ్రహ్మానందం 1,000కు పైగా సినిమాలలో నటించడం వల్ల గిన్నీస్ బుక్ రికార్డులలోకి ఎక్కారు.హాస్య నటుడిగా బ్రహ్మానందం ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం.బ్రహ్మానందం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్ గా పని చేశారు.

 Interesting Facts About Star Comedian Brahmanandam Details, Brahmanandam, Pakapa-TeluguStop.com

ఒకవైపు కాలేజ్ లో లెక్చరర్ గా పని చేస్తూనే బ్రహ్మానందం మిమిక్రీ చేయడంతో పాటు నాటకాలు వేసేవారు.అప్పటి రచయితలలో ఒకరైన ఆదివిష్ణు బ్రహ్మానందంలోని టాలెంట్ ను గుర్తించి దూరదర్శన్ లో ప్రసారమవుతున్న పకపకలు అనే ప్రోగ్రామ్ లో అవకాశం ఇప్పించారు.

ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కావడంతో కమెడియన్ గా బ్రహ్మానందంకు మంచి పేరు వచ్చింది.ఆ ప్రోగ్రామ్ ను చూసిన జంధ్యాల బ్రహ్మానందంకు సత్యాగ్రహం అనే మూవీలో ఛాన్స్ ఇచ్చారు.

అయితే సినిమాలలో నటించాలంటే బ్రహ్మనందం మొదట కొంత టెన్షన్ పడ్డారు.

Telugu Rupees, Brahmanandam, Door Darshan, Jandhyala, Jatiratnalu, Pakapakalu-Mo

అయితే ఆ తరువాత జంధ్యాల తాను ఏం చెబితే అదే చేయాలని భరోసా ఇవ్వడంతో బ్రహ్మానందం సినిమాలలో నటించడానికి ఓకే చెప్పారు.ఆ తర్వాత బ్రహ్మానందంకు శ్రీ తాతావతారం, అహ నా పెళ్లంట సినిమాలో అవకాశం దక్కింది.అహ నా పెళ్లంట సినిమాలో కామెడీ అద్భుతంగా చేయడంతో బ్రహ్మానందంకు వరుసగా మూవీ ఆఫర్లు దక్కాయి.

Telugu Rupees, Brahmanandam, Door Darshan, Jandhyala, Jatiratnalu, Pakapakalu-Mo

ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకున్న బ్రహ్మానందం దర్శకుల ప్రోత్సాహంతో స్టార్ కమెడియన్ స్టేటస్ ను అందుకున్నారు.ఈ ఏడాది జాతిరత్నాలు మూవీతో హిట్ కొట్టిన బ్రహ్మానందం ప్రస్తుతం రోజుకు 5 లక్షల రూపాయల చొప్పున పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.బ్రహ్మనందం వల్ల సినిమాకు ప్లస్ అవుతుండటంతో నిర్మాతలు సైతం రికార్డుస్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube