ఆ ఐదు సీన్లు లేకపోతే ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్లాప్ అయ్యేదా.. అదే నిజమంటూ?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఏ సినిమాను తెరకెక్కించినా ఆ సినిమా అంచనాలను మించి సక్సెస్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

అయితే జక్కన్న ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లు చేశారని స్వయంగా ఆయన అభిమానులు చెబుతున్నారు.

విక్రమార్కుడు సినిమాలో కొంత భాగం చంబల్ లో జరిగినా ప్రేక్షకులకు అర్థం కావడానికి సినిమాలో అన్ని పాత్రలు తెలుగులో మాట్లాడేలా జాగ్రత్తలు తీసుకున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో మాత్రం కొన్ని ఇంగ్లీష్ డైలాగ్స్ ద్వారా ప్రేక్షకులకు విసుగు తెప్పించారు.ఆర్ఆర్ఆర్ సినిమా రెండు మూడు సార్లు చూసిన ప్రేక్షకులకు సైతం ఆ డైలాగ్స్ అర్థం కాలేదు.

కొన్ని ఇంగ్లీష్ డైలాగ్స్ కు తెలుగు వాయిస్ ఓవర్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్న రాజమౌళి మిగతా సీన్లకు సైతం అదే విధంగా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని నెటిజన్లలో చాలామంది కామెంట్లు చేశారు.మరోవైపు ఈ సినిమాలో ఐదు పవర్ ఫుల్ సీన్లు హైలెట్ గా నిలిచాయని ఆ సీన్లు లేకపోతే మాత్రం సినిమా ఫ్లాప్ అయ్యేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

సినిమాలో చాలా సీన్లు బోరింగ్ గా ఉన్నాయని సినీ అభిమానులు చెబుతున్నారు.

Advertisement

చరణ్, తారక్ ఇంట్రడక్షన్ సీన్లు, జంతువులతో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చే సీన్, కొమురం భీముడో సాంగ్, క్లైమాక్స్ లో అల్లూరి పాత్రలో చరణ్ కనిపించే సీన్లు లేకపోతే ఆర్ఆర్ఆర్ మూవీ రిజల్ట్ మాత్రం దారుణంగా ఉండేదని కొందరు నెటిజన్లు చెబుతున్నారు.బాహుబలి2 తరహా గ్రిప్పింగ్ సీన్లు ఆర్ఆర్ఆర్ లో లేవని చరణ్, తారక్, అజయ్ దేవగణ్ మినహా మిగిలిన వాళ్ల పాత్రలలో ఎవరి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రను మరింత బెటర్ గా రాసుకునే వీలు ఉందని కానీ రాజమౌళి ఆ పాత్ర విషయంలో కొంతమేర నిర్లక్ష్యంగా వ్యవహరించాడని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.రాజమౌళి ఈ తప్పులను సరిదిద్దుకుని ఉంటే ఈ సినిమా బాహుబలి2 కలెక్షన్లను క్రాస్ చేసేదని తారక్, చరణ్ అభిమానులు చెబుతున్నారు.అయితే ఆర్ఆర్ఆర్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇద్దరు హీరోల అభిమానులు సంతోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు