సాధారణంగా సీరియల్ హీరోయిన్లు సినిమా హీరోయిన్ల స్థాయిలో పాపులారిటీని సంపాదించుకోవడం కష్టమనే సంగతి తెలిసిందే.అయితే కార్తీకదీపం సీరియల్ ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్ కు మాత్రం సినిమా హీరోయిన్లను మించిన పాపులారిటీ ఉంది.
వంటలక్క టాలెంట్ వల్ల పెద్దపెద్ద స్టార్ హీరోల స్థాయిలో ఈ సీరియల్ కు టీఆర్పీ రేటింగ్ వస్తుండటం గమనార్హం.సినిమాల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ప్రేమీ విశ్వనాథ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు.
రియల్ లైఫ్ లో ఎంతో అందంగా ఉండే ప్రేమీ విశ్వనాథ్ కార్తీకదీపం సీరియల్ లో మాత్రం డీగ్లామర్ రోల్ లో కనిపిస్తున్నారు.సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో సీరియళ్లతో పాటు వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అప్ డేట్స్ ను ప్రేమీ విశ్వనాథ్ పంచుకుంటున్నారు.
సీరియళ్లు అంటే అస్సలు ఇష్టపడని మగవాళ్లు సైతం కార్తీకదీపం సీరియల్ ఎంతో బాగుంటుందని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
తెలుగులో కార్తీకదీపంలో నటిస్తున్న ప్రేమీ విశ్వనాథ్ మలయాళంలో కూడా ఒక సీరియల్ లో నటిస్తున్నారు.

తెలుగమ్మాయి కాకపోయినా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు ప్రేమీ విశ్వనాథ్ ను అభిమానిస్తున్నారు.సీరియల్ లో తెగ వంటలు చేసే ప్రేమీ విశ్వనాథ్ కు రియల్ లైఫ్ లో మాత్రం వంటలు చేయడం రాదని సమాచారం.ప్రేమీ విశ్వనాథ్ ఎక్కువగా నాన్ వెజ్ తో చేసిన వంటకాలను ఇష్టపడతారని తెలుస్తోంది.

సెట్ లో ప్రేమీ విశ్వనాథ్ యాక్టివ్ గా ఉంటారని ఆమెతో పని చేస్తున్న సెలబ్రిటీలు చెబుతున్నారు.ప్రేమీ విశ్వనాథ్ భర్త వినీత్ భట్ ప్రముఖ ఆస్ట్రాలజర్ అనే సంగతి తెలిసిందే.ఎంతోమంది రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు సైతం వినీత్ భట్ కు క్లయింట్స్ గా ఉండటం గమనార్హం.
కార్తీకదీపం సీరియల్ ను సాగదీస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నా సీరియల్ కు మంచి రేటింగ్స్ వస్తున్నాయి.