మోహన్ బాబు, రాజశేఖర్ వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ఏదో మీకు తెలుసా?

ఎం.రాజా డైరెక్షన్ లో తెరకెక్కి 2001 సంవత్సరంలో విడుదలైన హనుమాన్ జంక్షన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

జగపతిబాబు, అర్జున్, వేణు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.స్నేహ, లయ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.అయితే ఈ సినిమాకు మొదట ఎంపికైన హీరోలు మాత్రం వీళ్లు కాదు.

మోహన్ బాబు, రాజశేఖర్ ఈ సినిమాలో హీరోలుగా నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అర్జున్, జగపతిబాబు ఈ సినిమాలో నటించాల్సి వచ్చింది.ఈ సినిమా డైరెక్టర్ మోహన్ రాజా ప్రస్తుతం తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Advertisement

మోహన్ రాజా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తెన్ కాశి పట్టణం అనే సినిమాను తెలుగులో తెరకెక్కించారు.ఈ సినిమాలో నటించడానికి మోహన్ బాబు, రాజశేఖర్ అంగీకరించి అడ్వాన్స్ కూడా తీసుకున్నారు.

అయితే ఆ తర్వాత వాళ్లిద్దరూ తప్పుకొని జగపతిబాబు, అర్జున్ ఈ సినిమాలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.దర్శకుడు మోహన్ రాజా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరికీ తెలియని ఈ విషయాన్ని వెల్లడించారు.తెన్ కాశిపట్టణం లైన్ ను మాత్రమే తీసుకుని మోహన్ రాజా కథలో కీలక మార్పులు చేశారు.

ఆ మార్పుల వల్ల ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తర్వాత మోహన్ రాజా తెలుగులో ఆఫర్లు వచ్చినా సినిమాలు చేయలేదు.చాలా సంవత్సరాల తర్వాత మోహన్ రాజా తెలుగులో తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?
Advertisement

తాజా వార్తలు