రాహుల్ గాంధీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్..?!

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తుంటాడు.ఆయన మాటలు దురుసు కొందరికి అనిపించడంతో ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తుంటారు.

మోదీ ప్రభుత్వం పై రాహుల్ గాంధీ తనదైన శైలిలో విరుచుకు పడుతూనే ఉంటాడు.తాజాగా రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా బ్లాక్ అయ్యింది.

ఇకపోతే ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా త్వరలోనే బ్లాక్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.రాహుల్ గాంధీ పై చర్యలు తీసుకోవాలని ఫేస్బుక్ కు ఫిర్యాదు అందింది.

ఆయనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ​ఫేస్బుక్​ కు ఓ లెటర్ రాసింది.గత కొన్ని రోజులకు ముందు ఢిల్లీలో ఓ హత్యాాచారం జరిగింది.

Advertisement

ఆ సమయంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబీకుల వివరాలను రాహుల్ గాంధీ తెలియజేస్తూ పోస్టు పెట్టాడు.దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్సీపీసీఆర్ ఫేస్బుక్ కు లెటర్ రాసింది.

ఇన్స్టాగ్రామ్ లో రాహుల్ గాంధీ ఓ వీడియోను పోస్టు చేశాడు.ఆ వీడియోలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబం కనపడేలా ఉంది.

బాలిక కుటుంబీకులు కనిపించడం వల్ల అది చట్టాలను లెక్కచేయకపోవడమే అవుతుంది.జువైనల్​ జస్టిస్​ యాక్ట్​ - 2015, పోక్సో చట్టం - 2012, ఐపీసీ లోని రూల్స్ ను రాహుల్ గాంధీ పాటించకపోవడం వల్ల ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాపై చర్యలు తీసుకోవాలని ఫేస్బుక్ యాజమాన్యానికి ఎన్​సీపీసీఆర్​ ఓ లెటర్ రాసింది.

ఆగస్టు నెల 1వ తేదీన ఢిల్లీలో ఈ ఘోరం జరిగింది.ఓ శ్మశానం వద్ద దళిత అమ్మాయిని అత్యాచారం చేశారు.ఆ సంఘటన దేశం మొత్తం కలకలం రేపింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఆగస్టు 2వ తేదీన ఆ బాలిక కుటుంబీకులను రాహుల్ గాంధీ కలిసి మాట్లాడారు.రాహుల్ గాంధీ వారిని తన కారులో కూర్చోబెట్టి మాట్లాడిన వీడియోను ఆయన తన ట్విట్టర్ లో ఆయన షేర్ చేశాడు.

Advertisement

దీంతో ఎన్​సీపీసీఆర్​ స్పందిస్తూ ట్వీట్​ చేసింది.అందుకే ఆయన ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేసింది.

చూడాలి మరి ఫేస్బుక్ యాజమాన్యం ఈ విషయంపై ఎలాంటి అభ్యంతరాలు తెలియజేస్తుందో.

తాజా వార్తలు