స్థంభంపల్లి గంజీవాగు హైలెవల్ వంతెన పనులను పరిశీలన

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం( Boinpalle ) స్థంభంపల్లి గ్రామంలో గంజీవాగు వద్ద నిర్మిస్తున్న హైలెవల్ వంతెన పనులను త్వరగా పూర్తి చేయాలనీ స్తంభంపల్లి మాజీ సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కరుణాకర్ లు అధికారులను కోరారు.

గంజి వాగు వద్ద జరుగుతున్న హై లెవెల్ వంతెన పనులను బుధవారం మాజీ సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కరుణాకర్ లు పరిశీలించి అనంతరం మాట్లాడుతూ చిన్న పాటి వర్షం కురిసిన నీటి ప్రవాహం ఉదృతం పెరిగి రాకపోకలకు ఇబ్బందిగా మారి ప్రయాణికులకు,రైతులకు( farmers) తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని సంబంధింత అధికారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు.

Latest Rajanna Sircilla News