బిడెన్ కి బిగ్ షాక్...ట్రంప్ కి జై కొడుతున్నఇండో అమెరికన్స్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఓటములు ఏ పార్టీ పంచుకుంటుందోననే టెన్షన్ వాతావరం రోజు రోజుకి కన్పిస్తోంది.

బిడెన్ గెలుస్తాడంటూ కొందరు, లేదు లేదు ట్రంప్ గెలుపు ఖాయమంటూ మరికొందరు ఇలా గందరగోళ వాతావరణం కనిపిస్తోంది.

రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ ఇస్తూ వచ్చే సర్వేలు సైతం ఎవరు అధికారంలోకి వస్తారు అనే విషయంపై ఎవరి వాదన వారిగా వినిపిస్తున్నాయి.కొన్ని రోజుల క్రితం వరకూ అధ్యక్షుడిగా బిడెన్ ఎన్నికవుతాడని, భారతీయ అమెరికన్స్ ఓట్లు బిడెన్ కి పడతాయని చెప్పిన సర్వేలు తాజాగా యూటర్న్ తీసుకున్నాయి.

అమెరికాలో భారతీయ అమెరికన్స్ ఓట్లు ట్రంప్ కి మళ్ళనున్నాయని, గడిచిన కొన్ని రోజులుగా ట్రంప్ మోడీ ఫోటోతో, వీడియోలతో చేస్తూ వచ్చిన ప్రచారం ఫలించిందని అంటున్నాయి సర్వేలు.ట్రంప్ కి ప్రధాని మోడీ కి ఉన్న స్నేహ బంధం కారణంగానే ట్రంప్ కి ఊహించని విధంగా ఈ మద్దతు లభించిందని అంటున్నారు.

అంతేకాదు ఇండో అమెరికన్స్ మద్దతుతో ట్రంప్ మరో సారి అధ్యక్షుడు కాబోతున్నాడని కూడా సర్వేలు తేల్చి చెప్పాయి.ఫ్లోరిడా , మిషిగావ్ , పెన్సిల్వేనియా, జార్జియా, ఉత్తర కరోలినా, వంటి స్వింగ్ స్టేట్స్ లో భారతీయ అమెరికన్స్ అత్యధికంగా ఉన్నారు.

Advertisement

ఆయా ప్రాంతాలలో ఎప్పటి నుంచో డెమొక్రాట్స్ కి మద్దతు ఇస్తున్నారు.కానీ ప్రస్తుతం వీరందరూ ట్రంప్ కి మద్దతు ఇస్తున్నారని సర్వేలో తేలింది.

అందుకు కారణం లేకపోలేదు.భారత్ ని అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న చైనా పై దూకుడుగా వ్యవహరించి చైనాని కట్టడి చేయడంలో ట్రంప్ పూర్తిగా భారత్ కి సహకరించారు.

, అంతేకాదు ట్రంప్ మోడీ మధ్య ఉన్న స్నేహంతో ప్రపంచంలో భారత్ మరింత శక్తివంతమైన దేశంగా ఎదిగిందనే అభిప్రాయం కలిగింది దాంతో ట్రంప్ కు ఈ సారి ఎన్నికల్లో ఇండో అమెరికన్స్ మద్దతు ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారని అంటున్నారు.అమెరికాలో ఉన్న ప్రముఖ తెలుగు పారిశ్రామిక వేత్తలు సైతం ఇదే అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?
Advertisement

తాజా వార్తలు