బిలియనీర్లుగా రాయల్ లైఫ్ ..చివరికి పూలమ్మిన చోటే కట్టెలమ్మడమంటే ఇదే..!

మనిషి జీవితం ఎప్పుడు ఎటు మళ్లుతుందో చెప్పడం కష్టం.కొందరు ఓవర్ నైట్ స్టార్లుగా మారితే.

మరికొందరు ఉన్నదంతా పోగొట్టుకుని రోడ్డున పడిన సందర్భాలున్నాయి.డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన వాళ్లు సైతం చేతిలో చిల్లిగవ్వ లేకుండా అరిగోస పడ్డ ఘటనలూ ఉన్నాయి.

బాగా బతికిన కొందరు బిలియనీర్లు.ప్రస్తుతం భయంభయంగా జీవితాలు గడుపుతున్న పరిస్థితులున్నాయి.ఏ దారీ లేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.

ఇంతకీ విలాససవంతమైన జీవితం నుంచి సమస్యల సుడిగుండంలో చిక్కిన ధనవంతులెవరో ఇప్పుడు చూద్దాం.

విజయ్ మాల్యా

Advertisement

లిక్కర్ కింగ్.విజయ్ మాల్యా.ఇండియన్ బిలియనీర్.

ఆర్సీబీ ఫ్రాంచైజీ ఓనర్.రాజాలాంటి జీవినం సాగించిన విజయ్ మాల్యా.రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి.దేశాన్ని విడిచి పారిపోయాడు.

తనని ఎలాగైనా బ్రిటన్ నుంచి భారత్ కు తీసుకొచ్చి కేసులు పెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తుంది.మాల్యా గనుక స్వదేశానికి తిరిగొస్తే అతతడి నుంచి సుమారు రూ.9వేల కోట్లు వసూలు చేయడానికి 17 బ్యాంకులు రెడీ అవుతున్నాయి.మెహుల్ ఛోక్సీ

భారత్ నుంచి పరారై ఆంటిగ్వా అండ్ బార్బుడాలో ఉన్నాడు మెహుల్ ఛోక్సీ.భారత్‌లో 4వేలపైగా ఆభరణాల స్టోర్స్ ఉన్న గీతాంజలి గ్రూప్ యజమాని.దీన్ని అడ్డుపెట్టుకున్న ఛోక్సీ.పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 1.8 బిలియన్ డాలర్లకు టోకరా ఇచ్చాడు.అనంతరం దేశం విడిచి పారిపోయాడు.సత్యం రామలింగరాజు

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

దేశంలో అత్యంత సక్సెస్‌ఫుల్ ఐటీ సంస్థల్లో సత్యం కంప్యూటర్స్ ఒకటి.కంపెనీకి చెందిన రూ.7,140 కోట్లను సత్యం రామలింగరాజు కాజేశారు.ఈ విషయాన్ని అంగీకరించిన తర్వాత సత్యం బోర్డుకు ఆయన రాజీనామా ఇచ్చారు.

Advertisement

అనంతం జైలుకు వెళ్లాడు.ఆ తర్వాత ఈ కంపెనీని మహీంద్రా సంస్థ కొనుగోలు చేసి మహీంద్రా సత్యంగా మార్చింది.నీరవ్ మోదీ

భారత్‌లో సంచలనం సృష్టించిన ఆర్థిక నేరగాళ్ల జాబితాలో నీరవ్ మోదీ ఒకడు.ఈ వజ్రాల వ్యాపారి భారతీయులనే కాదు, విదేశీయులను కూడా మోసం చేశాడు.పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి 28వేలకోట్లు కాజేశాడు.

కాలిఫోర్నియాకు చెందిన ఒక బిజినెస్‌మేన్‌ను కూడా మోసం చేశాడు.సీబీఐతో పాటు అమెరికా పోలీసులు, ఇంటర్‌పోల్ సైతం నీరవ్ మోదీని వాంటెడ్ జాబితాలో చేర్చాయి.

ప్రస్తుతం అతడు యూకేలో ఉన్నాడు.సుబ్రతా రాయ్

సెబితో కొన్ని వివాదాలు రావడంతో సహారా ఇండియా గ్రూపుపై కేసు వేసింది.2019 జనవరి 31కి సహారా గ్రూపు రూ.10,261 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.ఈ కేసు విచారణ కోసం కోర్టుకు హాజరు కానందున సహారా గ్రూపు చైర్మన్ సుబ్రతా రాయ్‌ను అరెస్టు చేయాలని 2014లో కోర్టు ఆదేశించింది.

ఆ తర్వాత ఢిల్లీలోని తిహార్ జైల్లో కొంతకాలం శిక్ష అనుభవించిన ఆయన.మే 2016 నుంచి పెరోల్ పై బయటే ఉన్నారు.అనిల్ అంబానీ

అంబానీ కుటుంబంలో పుట్టిన అనిల్ అంబానీ అప్పులపాలయ్యాడు.ఓ దశలో అన్నయ్య ముకేష్ అంబానీ సాయం చేయకపోయి ఉంటే అనిల్ జైలు జీవితం గడపాల్సి వచ్చేది.ఎరిక్‌సన్ ఏబీ సంస్థ భారతదేశ యూనిట్ చెల్లించాల్సిన 77 మిలియన్ డాలర్ల బకాయిలు చెల్లించాలన్నది.

లేదంటే ఆ సంస్థకు హామీ ఇచ్చిన అనిల్ ని జైల్లో వేయాల్సి వస్తుందని సుప్రీం కోర్టు హెచ్చరించింది.వి.జి.సిద్ధార్థ

భారతదేశంలో అతిపెద్ద కాఫీ చైన్ సంస్థ కేఫ్ కాఫీ డే సీఈవో వి.జి.సిద్ధార్థ అప్పుల బాధ, ఇన్‌కంట్యాక్స్ అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు.బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి చనిపోయాడు.సిద్ధార్థ మృతి తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే.

కేఫ్ కాఫీ డే భారాన్ని భుజాలకెత్తుకున్నారు.అప్పులన్నీ తీరుస్తూ కంపెనీ ముందుకు నడిపిస్తున్నారు.

తాజా వార్తలు