విదేశీ లీగుల్లో భారత క్రికెటర్లు ఆడే విషయంపై బీసీసీఐ కీలక నిర్ణయం..!

ప్రస్తుతం సౌదీ అరేబియాలో క్రికెట్ లీగ్ ( Saudi Arabia ) త్వరలోనే ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి.

సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన టీ -20 లీగ్ ను( T20 League ) తమ దేశంలో ఏర్పాటు చేయాలని, ఇందుకోసం టీ 20 లీగ్ ఐపీఎల్ యజమానులతో( IPL ) సౌదీ అరేబియా చర్చలు కూడా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్ల గురించి ఒక చర్చ మొదలైంది.సౌదీ అరేబియా లీగ్ లలో భారత్ ప్లేయర్లు ఆడతారా .ఆడరా అనే విషయం తెర పైకి వచ్చింది.దీనిపై బీసీసీఐ స్పందిస్తూ, భారత క్రికెట్ బోర్డు కు సొంత విధానం ఉందని, దానికే బోర్డు కట్టుబడి ఉంటుందని తెలిపింది.

బీసీసీఐ అధికారి క్రిక్ బజ్ తో మాట్లాడుతూ.భారత ఆటగాలను విదేశీ లీగ్ లలో ఆడించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.ఈ మేరకు ఒక ప్రకటన కూడా బీసీసీఐ జారీ చేసింది.

ఒకవేళ భారత ఆటగాళ్లు విదేశీ లీగుల్లో ఆడనప్పటికీ, విదేశీ లీగుల్లో భాగామవ్వాలనుకునే తమ ఫ్రాంచైజీలను బీసీసీఐ అడ్డుకోబొదని, అది ఫ్రాంచైజీల వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది.ఇక సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ ను ప్రారంభించాలని ప్రయత్నిస్తున్న క్రమంలో బీసీసీఐ ఈ ప్రకటనను జారీ చేసింది.

Advertisement

ఏదైనా ధృవీకరించబడాలంటే లీగ్ ముందుగా ఐసీసీ నుండి గుర్తింపు పొందవలసి ఉంటుంది.క్రికెట్ పై సౌదీ అరేబియా కు ఉన్న ఆసక్తి గురించి ఐసీసీ అధ్యక్షుడు గ్రెగ్ బార్ల్కే ఇప్పటికే ధ్రువీకరించారు.ప్రస్తుతం సౌదీ అరేబియా టీ 20 లీగ్ అధికారులు ఐపీఎల్ నిర్వహకులతో చర్చలు జరుపుతున్నట్లు ది ఏజ్ పేర్కొంది.

ఎట్టకేలకు సౌదీ అరేబియా లీగ్ లలో భారత ఆటగాళ్లు ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు