ఉక్రెయిన్ – రష్యాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.చర్చలు విఫలం అవ్వడంతో రష్యా దాడులను తీవ్ర తరం చేసింది.
యుద్ధం మొదలైన సమయంలో కేవలం సైనిక స్థావరాలపై, యుద్ద సామాగ్రిపై మాత్రమే దాడులు జరిగాయి అయితే చర్చల అనంతరం రష్యా జనావాసాలపై నేరుగా దాడులు చేస్తోంది.ఇప్పటి వరకూ సుమారు 450 మంది పౌరులు చనిపోగా అందులో 15 మంది పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.
ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో భవిష్యత్తులో మరిన్ని భీకర దాడులు రష్యా చేయబోతోందని గ్రహించిన భారత్ కైవ్ లో ఉన్న భారతీయులు వెంటనే అక్కడి నుంచీ వచ్చేయాలని హెచ్చరించింది.
ఈ క్రమంలోనే రష్యా ఉక్రెయిన్ లోని ఖార్కివ్ లో జరుపుతున్న దాడులలో భారత విద్యార్ధి మృతి చెందినట్టుగా కేంద్ర విదేశాంగ శాఖా అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి ట్విట్టర్ లో వెల్లడించారు.
అయితే మృతుడి వివరాలు ఇంకా స్పష్టంగా తెలుపలేదు.ఈ పరిస్థితుల నేపధ్యంలో ఉక్రెయిన్ లోని రాయబార కార్యాలయం కైవ్ లోని భారతీయ విద్యార్ధులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కైవ్ లోని భారతీయులు తక్షణమే కైవ్ విడిచి పెట్టేయాలని ఆదేశించింది.ప్రస్తుతం పరిస్థితులు చేయి దాడిపోయెలా ఉన్నాయని విద్యార్ధులు రైలు, ఇతర ఏదైనా మార్గాల ద్వారా కైవ్ ను విడిచి పెట్టాలని ఏ క్షణంలోనైనా యుద్ధం తీవ్ర రూపం దాల్చోచ్చని తెలిపింది.
ఇదిలాఉంటే.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులను తరలించేందుకు ఏర్పాటు చేసిన ఆపరేషన్ గంగ ను మరింత వేగంగా చేయాలని ప్రధాని మోడీ ఆదేశించడంతో భారత వైమానిక దళం ఆపరేషన్ గంగ లో C -17 విమానాలని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాయి.
ఈ C -17 విమానాల ప్రత్యేకత ఏంటంటే.ఒకేసారి సుమారు 336 మందిని తరలిస్తుంది.
ఆఫ్ఘాన్ క్రైసిస్ లో ఈ విమానాన్నే భారత ప్రభుత్వం ఉపయోగించింది.