భారత్ నుంచీ ఎంతో మంది యువతీ యువకులు ఉన్నత విద్య కోసం పలు దేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు.తమ కలను సాకారం చేసుకోవడానికి, ఆర్ధికంగా నిలబడటానికి తల్లి తండ్రులను, సొంత ఊరిని విడిచి దేశం కాని దేశం వెళ్తుంటారు.
అలా వెళ్ళిన వారు అక్కడ ఎదో ఒక కారణంగా మృతి చెందింతే వారి కుటుంభ సభ్యుల ఆవేదన, పుత్ర శోకం ఎవరూ తీర్చలేనిది.ఇలాంటి ఘటనే చైనాలో చోటు చేసుకుంది.
చైనాలో భారత్ కు చెందిన విద్యార్ధి మృతి అనుమానాస్పదంగా మారింది.అతడిది సహజ మరణమా లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎన్నో ఆశలతో, ఉన్నత చదువుల కోసం చైనా వెళ్ళిన అతడు విగత జీవిగా తను ఉండే రూమ్ లో పడి ఉండటం వారి కుటుంభ సభ్యులను కలిచేవేస్తోంది.బీహార్ లోని గయ కు చెందిన అమన్ నాగ్ సేన్ అనే 20 ఏళ్ళ యువకుడు ఉన్నత చదువుల కోసం చైనా వెళ్ళాడు.
అక్కడి ఓ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ చదువుతున్న అతడు అనుమానాస్పదంగా మృతి చెందాడు.నాగ సేన్ చివరిగా జులై 23 తేదీన తల్లి తండ్రులతో మాట్లాడాడని, ఆ తరువాత ఎన్నో సార్లు తమ కొడుకుకు ఫోన్ లు మేసేజ్ లు చేశామని అయితే ఏ మాత్రం అతడి నుంచీ స్పందన లేదని వాపోతున్నారు తల్లి తండ్రులు.అయితే

అదే రోజు సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసినా స్పందించలేదని, దాంతో తమ కొడుకు చదివే యూనివర్సిటీ అధికారులను సంప్రదించగా తమ కొడుకు మృతి చెందినట్టుగా తెలిపారని ఆవేదన చెందుతున్నారు.తమ కుమారుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు కూడా లేవని వాపోతున్నారు.తమ కుమారుడి మృతికి కారణాలు తెలియాలని కోరుతున్నారు.ఇదిలాఉంటే నాగసేన్ మృత దేహాన్ని భారత్ కు రప్పించేందుకు కేంద్రం సహకరించాలని కుటుంభ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నాగ్ సేన్ మృతి ఎలా జరిగింది, హత్యా లేక ఆత్మ హత్యా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.