కెనడా: కాలేజ్ మూసివేత.. ఆర్ధిక కష్టాలు, మనస్తాపంతో భారతీయ విద్యార్ధి ఆత్మహత్య

2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి పీడ ఇంకా ఈ భూగోళాన్ని విడిచిపెట్టడం లేదు.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్ల రూపంలో కోవిడ్ పంజా విసురుతూనే వుంది.

ఇటీవల ఒమిక్రాన్ పీడ పోయిందని.ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ దాని ఉప రకాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.

Indian Student Commits Suicide In Canada, China, Arshadeep, Gagga Near Patiala,

ప్రస్తుతం చైనా, హాంకాంగ్‌లను వైరస్ అల్లాడిస్తోంది.మనదేశంలోనూ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మరోసారి ఆంక్షలను అమలు చేసేందుకు పలు దేశాలు సిద్ధమవుతున్నాయి.అయితే కోవిడ్ కారణంగా కోట్లాది మందిని ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టాయి.

Advertisement

కుటుంబాన్ని పోషించలేక.అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడిన వారు ఎందరో.

తాజాగా ఆర్ధిక సమస్యల కారణంగా కెనడాలో భారతీయ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడిని పంజాబ్ రాష్ట్రానికి చెందిన అర్షదీప్ వర్మగా గుర్తించారు.

పాటియాలకు సమీపంలోని గగ్గా గ్రామానికి చెందిన అర్షదీప్ 2019 మేలో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు.అక్కడి ఒంటారియోలోని కేంబ్రిడ్జ్ కళాశాలలో చేరాడు.

అయితే ఆయన ఏ ముహూర్తంలో అక్కడికి వెళ్లాడో కానీ.ఆ మరుసటి ఏడాది నుంచే కరోనా వైరస్ విజృంభించడంతో కష్టాలు మొదలయ్యాయి.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

దీంతో కళాశాలలు మూతపడ్డాయి.ఓవైపు ఆర్ధిక ఇబ్బందులు.

Advertisement

మరోవైపు కాలేజీ మూతపడటంతో అర్షదీప్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.అయినప్పటీకి ఏదోలాగా బండి నడిపిస్తున్నాడు.అదే సమయంలో రూ.12 లక్షల వరకు అప్పులు చేయడం.చదువు మధ్యలోనే ఆగిపోవడంతో అర్షదీప్‌ కోలుకోలేకపోయాడు.

ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పెద్ద చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా వుంటాడునుకున్న కొడుకు కానరాని లోకాలకు తరలిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అర్షదీప్ మరణవార్తతో అతని స్వస్థలం గగ్గాలో విషాదం అలుముకుంది.అతని మృతదేహాన్ని భారతదేశానికి పంపేందుకు కెనడాలోని భారత రాయబార కార్యాలయం, ప్రవాస భారతీయ సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

తాజా వార్తలు