మందు బాటిల్‌తో తండ్రి తలపై కొట్టి చంపిన ఎన్నారై.. జైలు పాలు!

మద్యం తాగి క్షణికావేశంలో చేసే ఘోరాలు కొందరి ప్రాణాలను తీసేస్తే.మరికొందరిని జైలు పాలు చేస్తున్నాయి.

తాజాగా ఒక ఎన్నారై క్షణికావేశంలో తన తండ్రిపై దాడి చేసి హంతకుడయ్యాడు.చివరికి కటకటాల పాలయ్యాడు.వివరాలలోకి వెళితే.54 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన డీకాన్ పాల్ సింగ్ నార్త్ లండన్‌లో తన 86 ఏళ్ల తండ్రి అర్జన్ సింగ్ విగ్‌తో కలిసి నివసిస్తున్నాడు.డీకాన్ తండ్రి అకౌంటెంట్ కాగా తల్లి దమన్‌జిత్ (85) జంతుశాస్త్రవేత్త.

ఆమె కూడా కొడుకుతో కలిసి లండన్‌లో నాలుగు బెడ్ రూమ్స్ ఉన్న ఇంటిలో సుమారు 40 సంవత్సరాలుగా నివసిస్తున్నారు.అయితే కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పాల్ సింగ్ మద్యానికి బాగా అలవాటు పడ్డాడు.

2021, అక్టోబర్ నెలలో అతడు బాగా మద్యం తాగి తన తండ్రి తలపై షాంపైన్ బాటిల్‌తో కొట్టాడు.తండ్రికి బాగా గాయం కావడంతో అతడు మరణించాడు.దీని గురించి తెలుసుకున్న యూకే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Advertisement

తర్వాత పాల్ సింగ్ తండ్రి మరణించినట్లు తెలుసుకున్నారు.నేరం జరిగిన ప్రదేశంలో, పోలీసులు 100 షాంపైన్ బాటిళ్లను, 10 అమెజాన్ డెలివరీ బాక్స్‌లు విస్కీ బాటిళ్లను, బెడ్‌పై ఖాళీగా ఉన్న టాలిస్కర్ స్కాచ్ బాటిల్‌ను కనుగొన్నారు.

పాల్ సింగ్ విచారణ సమయంలో మాట్లాడుతూ తాను కావాలని తన తండ్రిని చంపలేదని, తన తండ్రిని చంపాలనే ఉద్దేశం తనకు లేదని వాపోయాడు.అయితే, జ్యూరీ అతనిని హత్యకు పాల్పడినట్లు నిర్ధారించడానికి ఒక రోజు కంటే తక్కువ సమయం పాటు చర్చించి హత్య చేసిన కేసులో దోషిగా తేల్చింది.పెరోల్‌కు అర్హత సాధించడానికి ముందు పాల్ సింగ్‌కి జీవిత ఖైదు విధించింది.

దాంతో కనీసం 18 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించక తప్పదు.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

తాజా వార్తలు