గతేడాది దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన 5G నెట్‌వర్క్ ‘ఎయిర్‌టెల్ 5G ప్లస్’ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.ఈ 5జీ సేవలను మొదటగా పలు నగరాల్లో ప్రారంభించింది.
తర్వాత కోహిమా, ఇటానగర్, ఐజ్వాల్‌తో సహా ఈశాన్య భారతదేశంలోని ఏడు కొత్త నగరాల్లో ప్రారంభించింది.ఎయిర్‌టెల్ 5G ప్లస్ ఇప్పుడు భారతదేశంలోని 80కి పైగా నగరాల్లో అందుబాటులో ఉంది.
వినియోగదారులు తమ 5G-ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఎటువంటి ఎక్స్‌ట్రా ఖర్చు లేకుండా హై-స్పీడ్ సేవను యాక్సెస్ చేయవచ్చు.మరి ఏ నగరాల్లో ఈ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి? మీరు ఉంటున్న ప్రదేశంలో కూడా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయా లేదా అనేది ఎప్పుడు లిస్ట్ ద్వారా తెలుసుకుందాం.
1.అస్సాంలో గౌహతి, టిన్సుకియా, దిబ్రూగర్, సిల్చార్.
2.ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి.
3.బీహార్‌లో పాట్నా, ముజఫర్‌పూర్, బోద్ గయం, భాగల్‌పూర్, బెగుసరాయ్, కతిహార్, కిషన్‌గంజ్, పూర్నియా, గోపాల్‌గంజ్, బార్హ్, బీహార్ షరీఫ్, బిహ్తా, నవాడా, సోనేపూర్.
4.ఢిల్లీ
5.గుజరాత్– అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్
6.హర్యానా– గురుగ్రామ్, పానిపట్, ఫరీదాబాద్, అంబాలా, కర్నాల్, సోనిపట్, యమునానగర్, బహదూర్‌ఘర్
7.జార్ఖండ్– రాంచీ, జంషెడ్‌పూర్
8.కర్ణాటక – బెంగళూరు
9. కేరళ– కొచ్చి, త్రివేండ్రం, కోజికోడ్, త్రిస్సూర్
10.మహారాష్ట్ర– ముంబై, నాగ్‌పూర్, పుణే
11.హిమాచల్ ప్రదేశ్– సిమ్లా
12.జమ్మూ కాశ్మీర్– జమ్మూ, శ్రీనగర్, సాంబా, కథువా, ఉధంపూర్, అఖ్నూర్, కుప్వారా, లఖన్‌పూర్, ఖౌర్.
13.తెలంగాణ– హైదరాబాద్, వరంగల్, కరీంనగర్
14.ఉత్తరప్రదేశ్– వారణాసి, లక్నో, ఆగ్రా, మీరట్, గోరఖ్‌పూర్, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, నోయిడా, ఘజియాబాద్
15.పశ్చిమ బెంగాల్ – సిలిగురి
16.సిక్కిం– గ్యాంగ్‌టక్
17.మిజోరాం– ఐజ్వాల్
18.అరుణాచల్ ప్రదేశ్– ఇటానగర్
19.నాగాలాండ్– కోహిమా
20.ఛత్తీస్‌గఢ్– రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్
20.త్రిపుర-అగర్తలా
21.ఉత్తరాఖండ్– డెహ్రాడూన్