భారత మూలాలున్న వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, క్రీడాకారులుగా వారు రాణిస్తున్నారు.
అయితే భారత్‌లోనూ భారత సంతతికి చెందిన వ్యక్తులు ముఖ్యభూమిక పోషించేందుకు సిద్ధమవుతున్నారు .తాజాగా భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) భారత సంతతికి చెందిన వ్యక్తులను ( పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్- పీఐవో) జాతీయ జట్టుకు ఎంపిక చేసేందుకు వున్న అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే( AIFF President Kalyan Chaubey ) తెలిపారు.త్వరలోనే అలాంటి 24 మంది ఆటగాళ్లను సంప్రదించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జాతీయ ఫుట్‌బాల్ జట్టులో పీఐవో, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) ఆటగాళ్లకు చోటు కల్పించడంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది.
జాతీయ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్( Igor Stimak ) ఇప్పటికే భారత జట్టుకు పీఐవో ఆటగాళ్లను ఎంపిక చేయాల్సిన అవసరాన్ని సమర్ధించారు.కానీ భారతీయ చట్టాలు ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించనందున కొన్ని న్యాయపరమైన ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి.పీఐవో ఆటగాళ్లు భారత్( india ) తరపున ప్రాతినిథ్యం వహించాలంటే వారు ఖచ్చితంగా భారత పౌరసత్వం తీసుకోవాలి.
అలాగే పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే ముందు ఓ వ్యక్తి తప్పనిసరిగా 12 నెలల పాటు భారతదేశంలో వుండాలి.తాము ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల తరపున ఆడుతున్న 24 మంది పీఐవో ఆటగాళ్లను సంప్రదించాలని చూస్తున్నామన్నారు చౌబే.
కానీ ద్వంద్వ పౌరసత్వం సమస్య వుందని.కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఏం జరుగుతుందో చూడాలని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయంపై అంతర్గత చర్చలు జరుపుతున్నామని, స్పష్టత వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తామని చౌబే తెలిపారు.
ఆంగ్లేయుడైన బాబ్ హౌటన్ 2006 నుంచి 2011 మధ్య జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వున్నప్పుడు .ఇంగ్లాండ్ ఏజ్ గ్రూప్ జట్లకు , న్యూకాజిల్ యునైటెడ్ , నాటింగ్‌హామ్ ఫారెస్ట్ వంటి క్లబ్‌లకు ఆడిన మైఖేల్ చోప్రాను( Michael Chopra ) సంప్రదించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి.అయితే 2008లో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పీఐవో ఆటగాళ్లను ఎంపిక చేసే యత్నాలను పూర్తిగా దెబ్బతీశాయి.
వారు భారత్ తరపున ఆడాలనుకుంటే ఖచ్చితంగా భారతీయ పౌరసత్వం తీసుకోవాలి.పీఐవోలు, ఓసీఐ కార్డ్ హోల్డర్లు తమ విదేశీ పౌరసత్వాన్ని వదులుకుని, భారతీయ పాస్‌పోర్ట్‌లను పొందని పక్షంలో దేశం తరపున ఆడటానికి అనర్హులు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy