అమెరికా : 20 ఏళ్ల నాటి బిన్‌లాడెన్ లేఖ వైరల్ .. టిక్‌టాక్‌ను నిషేధించాలన్న నిక్కీ హేలీ

ఒసామా బిన్‌లాడెన్.

( Osama Bin Laden ) ఈ పేరు వింటే ముందుగా గుర్తొచ్చేది అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ, అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చివేతలే.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యం అమెరికానే వణికించిన ఈ కరడుగట్టిన ఉగ్రవాది.తన సిద్ధాంతాలతో ఉగ్రవాదాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.

తాలిబన్ల అండతో పేట్రెగిపోయాడు.అయితే 9/11 దాడులతో తన చావును తనే కొని తెచ్చుకున్నాడు.

న్యూయార్క్ ట్విన్ టవర్స్( Newyork Twin Towers ) మీద జరిగిన దాడులతో అగ్రరాజ్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.ఈ దాడిలో సుమారు మూడు వేల మంది వరకు ప్రాణాలు కోల్పోగా .6వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన అమెరికా .తీవ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టి భీకరదాడులు చేసింది.ఈ దెబ్బకు అల్‌ఖైదా గ్రూపు చెల్లాచెదురైంది.

Advertisement

ఒసామా బిన్ లాడెన్‌ కోసం పదేళ్ల పాటు నింగి, నేలా అన్న తేడా లేకుండా వెతికిన అమెరికా .ఎట్టకేలకు 2011, మే2న పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్‌లో తలదాచుకున్న బిన్‌ లాడెన్‌ను హతమార్చిన విషయం తెలిసిందే.అయితే 12 ఏళ్ల కిందటే మట్టిలో కలిసిపోయిన బిన్ లాడెన్ పేరు తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది.అది కూడా ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం( Israel Hamas War ) కారణంగా.9/11 దాడుల తర్వాత అమెరికా ప్రజలనుద్దేశించి లాడెన్ రాసిన రెండు పేజీల లేఖ టిక్ టాక్‌లో వైరల్‌గా మారింది.పాలస్తీనాను ఆక్రమించి అణిచివేతకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్ధతు పలకడం కూడా 9/11 దాడులకు ఓ కారణమని బిన్‌ లాడెన్ ఆ లేఖలో పేర్కోన్నాడు.

పాలస్తీనా( Palestine ) ఎప్పటికీ ఆక్రమణలో వుండిపోదని, సంకెళ్లను తెంచుకునేందుకు ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు.అలాగే అమెరికా( America ) అహంకారానికి క్రైస్తవుల రక్తంతో మూల్యం చెల్లించక తప్పదని బిన్ లాడెన్ హెచ్చరించాడు.ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ( Nikki Haley ) స్పందించారు.

లాడెన్ వీడియోలు వైరల్ అయిన టిక్ టాక్‌ను( Tik Tok ) జాతీయ స్థాయిలో నిషేధించాలని ఆమె పిలుపునిచ్చారు.ఫాక్స్ న్యూస్ రేడియో ‘‘ ది గై బెన్సన్ షో’’లో పాల్గొన్న నిక్కీ హేలీ మాట్లాడుతూ.

టిక్‌టాక్‌ను నిషేధించాలని తాను చాలా కాలంగా చెబుతున్నానని గుర్తుచేశారు.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

టిక్ టాక్‌ అమెరికాలో 73 మిలియన్ల మందిని , ప్రపంచవ్యాప్తంగా 1.67 బిలియన్ల మంది యాక్టీవ్ యూజర్లను కలిగి వుంది.మా విదేశీ శత్రువులు తమ దుష్ట ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి సోషల్ మీడియాను ఎలా విషపూరితం చేస్తారు అనే దానికి ఇది ప్రధాన ఉదాహరణగా నిక్కీ హేలీ పేర్కొన్నారు.

Advertisement

టిక్ టాక్ ద్వారా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి అమెరికన్లను ప్రభావితం చేసే సామర్ధ్యాన్ని ఇవ్వడం ఆపాలని ఆమె పిలుపునిచ్చారు.గత వారం మియామీలో జరిగిన థర్డ్ రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌లో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామితో( Vivek Ramaswamy ) నిక్కీ హేలీకి గొడవ జరిగింది.

నిక్కీ కుమార్తె టిక్ టాక్ ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.అయితే ఈ విషయంలో తన కుమార్తెను తీసుకురావొద్దంటూ నిక్కీ హేలీ ఫైర్ అయ్యారు.

తాజా వార్తలు