తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!

వెస్ట్ లండన్‌లోని హౌన్స్లోకు చెందిన 10 ఏళ్ల బాలుడు క్రిష్ అరోరా 162 IQ స్కోరు(Krish Arora) సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

క్రిష్ స్కోరు అల్బర్ట్ ఐన్‌స్టీన్‌, స్టీఫెన్ హాకింగ్‌ల (Krish Score Albert Einstein, Stephen Hawking)వంటి ప్రముఖ శాస్త్రవేత్తల కంటే ఎక్కువగా ఉంది.

ఆ సైంటిస్టుల IQ 160కే పరిమితమైంది.ఈ అద్భుతమైన స్కోరుతో ఈ భారత సంతతి బాలుడు ప్రపంచంలోని అత్యంత తెలివైన వ్యక్తులలో టాప్ 1%లో చేరాడు.

తన ప్రతిభకు గుర్తింపుగా, క్రిష్‌ని(Krish) అత్యంత తెలివైన వ్యక్తుల సంస్థ మెన్సాలోకి ఆహ్వానించారు.అంతేకాకుండా ఈ సెప్టెంబర్ నుంచి యూకేలోని ఉత్తమ గ్రామర్ స్కూళ్లలో ఒకటైన క్వీన్ ఎలిజబెత్ స్కూల్‌లో చేరబోతున్నాడు.10 ఏళ్ల క్రిష్ అరోరా(Krish Arora) తన 11+ పరీక్షల్లో అద్భుతంగా రాణించాడు.ఆ పరీక్షలు తనకు చాలా సులభంగా ఉన్నాయని, ముఖ్యంగా గణితంలో 100 మార్కులు సాధించానని చెప్పాడు.

ప్రాథమిక పాఠశాల తనకు బోరింగ్‌గా అనిపిస్తుందని, తనకు సరిపడా సవాళ్లు ఇవ్వడం లేదని అన్నాడు."మేం చేసేది గుణకారం చేయడం, వాక్యాలు రాయడమే" అని అతను చెప్పాడు.

Advertisement

క్రిష్ ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఇష్టపడతాడు.తన కొత్త పాఠశాలలో మరింత కష్టతరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి ఆసక్తిగా ఉన్నాడు.

అధ్యయనాలతో పాటు, క్రిష్ ఒక ప్రతిభావంతుడైన సంగీతకారుడు కూడా.అతను పియానో వాయించడంలో ప్రావీణ్యం సంపాదించాడు.అనేక అవార్డులు గెలుచుకున్నాడు.

కేవలం ఆరు నెలల్లో నాలుగు గ్రేడ్‌ల పియానో సర్టిఫికేట్లు పూర్తి చేసి, ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లోని "హాల్ ఆఫ్ ఫేమ్"(Hall of Fame)లో స్థానం సంపాదించాడు.ప్రస్తుతం అతని వద్ద గ్రేడ్ 7 పియానో సర్టిఫికేట్ ఉంది.

క్రిష్ సంక్లిష్టమైన పాటలను జ్ఞాపకశక్తితో వాయించగలడు.పెద్ద వయస్సు గల పోటీదారులను కూడా ఓడించి అనేక పియానో పోటీల్లో విజేతగా నిలిచాడు.

డ్యాన్స్ లో టాలీవుడ్ నంబర్ హీరో అతనేనా.. చరణ్, బన్నీ, తారక్ లలో ఎవరంటే?
లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయిన యూకే యువకుడు.. అతని మృతి వెనక ఎన్నో సందేహాలు..

"నేను తప్పు చేయను అని తెలుసు కాబట్టి నాకు నరాలు బిగుసుకుపోవు" అని అతడు ధీమాగా చెబుతుంటాడు.

Advertisement

క్రిష్‌కు చెస్, పజిల్స్, క్రాస్‌వర్డ్ పజిల్స్ (Chess, puzzles, crossword puzzles for Krish)ఆడటం కూడా చాలా ఇష్టం.తన చెస్ టీచర్‌ను తరచూ ఓడిస్తూ, తన అద్భుతమైన సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శిస్తాడు.ఇద్దరూ ఇంజనీర్లు అయిన అతని తల్లిదండ్రులు, చిన్నతనం నుండే అతని ప్రతిభను గమనించారు.

నాలుగేళ్ల వయసులోనే అతను చదవడం ప్రారంభించాడు, అధునాతన గణిత సమస్యలను పరిష్కరించేవాడు.అతని తల్లి, "అతను ఏ పని చేసినా అందులో అత్యుత్తమంగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటాడు" అని చెప్పింది.

తాజా వార్తలు