యూకే : కేరళ విద్యార్ధినిపై కత్తితో భారతీయుడి దాడి.. రెస్టారెంట్‌లో అందరూ చూస్తుండగానే ఘటన

యూకేలో దారుణం జరిగింది.కేరళకు చెందిన విద్యార్ధినిపై భారత్‌కే చెందిన వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు.వివరాల్లోకి వెళితే.

తూర్పు లండన్‌లోని హైదరాబాదీ వాలా బిర్యానీ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది.నిందితుడిని 23 ఏళ్ల శ్రీరామ్ అంబర్లాగా గుర్తించారు.

కేరళకు చెందిన సోనా బిజు అనే విద్యార్ధిని స్థానిక యూనివర్సిటీలో చదువుకుంటూ రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ వెయిట్రెస్‌గా పనిచేస్తోంది.ఘటన తర్వాత నిందితుడు శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Advertisement

థేమ్స్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు.విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసిన కోర్టు.

శ్రీరామ్‌ను రిమాండ్‌కు తరలించింది.కత్తిపోట్లకు గురైన సోనూని పోలీసులు.

లండన్ అంబులెన్స్ సర్వీస్‌ సాయంతో ఆసుపత్రికి తరలించినట్లు మెట్రోపాలిటిన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.నిందితుడు శ్రీరామ్‌కి లండన్‌లో ఎలాంటి స్థిర నివాసం లేదని పోలీసులు చెబుతున్నారు.

రెస్టారెంట్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఈ దాడి జరిగింది.ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.శ్రీరామ్‌ కత్తితో దాడి చేయడానికి ముందు .బాధితురాలు అతనికి ఫుడ్ అందజేస్తున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది.అయితే ఏం జరిగిందో ఏమో కానీ నిందితుడు శ్రీరామ్ కత్తితో సోనూ బిజుపై దాడికి దిగాడు.

లోకేష్ యూనివర్స్ కి రంగం సిద్ధం చేస్తున్న దర్శకుడు...మామూలుగా ఉండదు...
ఆ స్టార్ డైరెక్టర్ కథను సిద్ధు జొన్నలగడ్డ రిజెక్ట్ చేశారట.. అసలేం జరిగిందంటే?

అంతేకాదు.మధ్యలో ఎవరైనా జోక్యం చేసుకుంటే చంపేస్తానంటూ కస్టమర్లు, హోటల్ సిబ్బందిని బెదిరించాడు.

Advertisement

రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.దీనికి సంబంధించిన వివరాలు తెలిస్తే తమను సంప్రదించాల్సిందిగా పోలీసులు కోరారు.

బాధితురాలు ఈస్ట్ లండన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్లుగా సమాచారం.ఈ కేసులో పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తామని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

తాజా వార్తలు