ఏపీ సీఎంకి మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ లేఖ..?!

విశాఖపట్నంలో మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేతపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్, మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ తీవ్రంగా స్పందించారు.

హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల పాఠశాల నలుగురు విద్యార్థులతో 2013లో ప్రారంభమై నేటికి 140కి పైగా విద్యార్థులకు జ్ఞానాలయంగా మారిందని తెలిపారు.

ఈ పాఠశాల నెలకొల్పిన శ్రీనివాస్‌ జీవితమంతా స్కూల్‌కే అంకితం చేశారని ఎమ్మెస్కే ప్రసాద్‌ గుర్తు చేశారు.అందుకే శ్రీనివాస్‌కు జ్యువెల్ ఆఫ్ ఇండియా అనే అవార్డు వచ్చిందన్నారు.

లీజు గడువు పూర్తయిందంటూ తొలగించిన ఈ పాఠశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి పునరాలోచించాలని ప్రసాద్‌ కోరారు.తెలుగు జట్టు మాజీ క్రికెటర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ చీఫ్‌ సెలక్టర్‌ పదవీకాలం ముగియగా ఇప్పుడు అతని స్థానంలో మరో తెలుగు జట్టుతో అనుబంధం ఉన్న ఆటగాడు సునీల్‌ జోషి సెలక్షన్‌ కమిటీకి కొత్త చైర్మన్‌గా వచ్చాడు.49 ఏళ్ల సునీల్‌ జోషి గతంలో హైదరాబాద్‌ రంజీ జట్టు హెడ్‌ కోచ్‌గా పని చేశాడు.మరోవైపు విశాఖలోని హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేత అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్టణం అనధికారికంగా విజయసాయిరెడ్డి పట్టణం అయిపోయిందని విమర్శించారు.కన్ను పడితే కబ్జా, ఖాళీ చేయకపోతే జేసీబీలతో విధ్వంసం అని మండిపడ్డారు.

Advertisement

పెదవాల్తేరులో వివిధ రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్న 190 మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్న హిడెన్ స్ప్రౌట్స్ పాఠశాలను ఏ2 రెడ్డి గ్యాంగులు కబడ్డీ పేరుతో కబ్జా చేయాలని చూశారని, సాధ్యం కాకపోయే సరికి రాజారెడ్డి రాజ్యాంగానికి అనువైన రోజే జేసీబీలతో కూల్చివేశారని లోకేశ్ ఆరోపించారు.మానసిక దివ్యాంగులకు నీడనిచ్చే పాఠశాలకు సాయం చేయాల్సింది పోయి, ఆక్రమించిన వైసీపీ నాయకుల పాపాలు పండే రోజు దగ్గరికొచ్చిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.దీనిపై సీఎం జగన్ ఇప్పటి వరకూ స్పందించలేదు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు