లాక్‌డౌన్ తర్వాత స్వదేశానికి : యూఎస్‌లో భారతీయులను సంప్రదిస్తున్న ఇండియన్ ఎంబసీ

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో వివిధ దేశాల్లో భారతీయులు చిక్కుకుపోయారు.

లాక్‌డౌన్ ముందు వరకు పలు దేశాల్లో ఉన్న వారిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చారు.

అయితే ఆ తర్వాత పరిస్ధితులు మారిపోవడంతో వీలు పడలేదు.మే 3 తర్వాత లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది.మొదటి దశలో గల్ఫ్ ప్రాంతంలో వున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తారు.

అనంతరం యూకే, యూరప్‌, యూఎస్‌‌లకు ఛాన్స్ దొరికే అవకాశం ఉంది.దీనిలో భాగంగా భారత రాయబార కార్యాలయం బుధవారం భారతీయ సంఘాలను సంప్రదించింది.

Advertisement

లాక్‌డౌన్‌ తర్వాత స్వదేశానికి వెళ్లాలని భావిస్తున్న వారు ఇండియన్ ఎంబసీని సంప్రదించాల్సిందిగా ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించింది.ఇందుకు ఆసక్తిగా ఉన్న వారు https://indianembassyusa.gov.in/Information_sheet1(Registration Links given below) లో నమోదు చేసుకోవాలని కోరింది.అయితే ప్రవాసులను భారత్‌కు తరలించే తేదీలు ఇంకా ప్రకటించబడలేదు.లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని భారతీయ అమెరికన్ సంఘాలు ఆదుకుంటున్నాయి.

వారికి ఉచిత వసతి, భోజనం మరియు ఆర్ధిక సహాయం చేస్తున్నాయి.అయితే పరిస్థితి రోజురోజుకు విషమిస్తుండటంతో, తాము స్వదేశానికి తిరిగి వెళ్తామంటూ సోషల్ మీడియాలో పలువురు భారత రాయబార కార్యాలయానికి మొరపెట్టుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు