బ్రిటన్ పత్రికలని అల్లాడిస్తున్న భారత కుబేరుడు

బ్రిటన్ లో ఇప్పుడు ఒక భారతీయ కుటుంభం ఎంతో హాట్ టాపిక్ అయ్యింది.

భారతీయ కుబేరుడు తన కుమార్తె ఉన్నత చదువుల కోసం బ్రిటన్ లో ఆమె కూతురు కోసం ఏర్పాటు చేసిన సకల మర్యాదలు చూస్తె బ్రిటన్ రాజవంశ కుటుంభం కూడా నోరు వెళ్ళ బెడుతుండా అనే విధంగా ఉంది.

తన కూతురు సుఖం కోసం ఆమె ఆ దేశంలో ఇబ్బంది పడకూడదని ఏకంగా ఆమె తండ్రి 12 మంది మహిళలని తన కూతురుకి సేవ చేసేందుకు నియమించాడు.

అంతేకాదు తన కూతురు కోసం అత్యంత విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.అంతేకాదు బ్రిటన్ లో స్కాట్లాండ్‌ సెయింట్‌ ఆండ్రూస్‌ విశ్వవిద్యాలయంలో ఆమె చెరనుంది అయితే ఈ విద్యాలయంలో ప్రిన్స్‌ విలియమ్స్, అతని భార్య కేట్‌ మిడిల్టన్‌ చదివిన సెయింట్‌ ఆండ్రూస్‌ వర్సిటీలో ఆమె ఎంట్రీ ఇప్పుడు ఒక సంచలనంగా మారిపోతోంది.ఎవరా అమ్మాయి ఆ అమ్మాయి ఎలా ఉండబోతోంది.అంటూ అందరూ ఎంతో ఉత్ఖంటగా ఎదురు చూస్తున్నారట

అయితే తన కూతురు కి సేవలు చేసేందుకు ఒక ఏజెన్సీ ద్వారా ఇచ్చిన ప్రకటనకి భారీ రెస్పాన్స్ వస్తోందట ఆ ప్రకటనలో ఎంతో హుషారుగా ఉండేవారు మాత్రమే కావాలని అంటూ కొన్ని కండిషన్స్ కూడా పెట్టారట అంతేకాదు ఒక్కొక్కరికి సంవత్సరానికి 28 లక్షల రూపాయలు చెల్లిస్తామని కూడా ఆ ప్రకటనలో తెలపడంతో ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఎవరూ అమ్మాయి ఎలా ఉంటుంది అనే ఆత్రుత బ్రిటన్ పత్రికలని కుదిపేస్తోంది.అయితే త్వరలోనే ఈ మిస్టరీ వీడనుందట.

Advertisement
అందంగా పుట్టడమే ఈ మోడల్ తప్పయింది.. ఫ్రెండ్స్ ఏం చేశారో తెలిస్తే..
Advertisement

తాజా వార్తలు