వృద్ధులే టార్గెట్ .. భారీ మోసం: అమెరికాలో భారత సంతతి వ్యక్తికి జైలు

ఇటీవలికాలంలో అమెరికాలో వెలుగుచూస్తున్న పలు మోసాల్లో భారత సంతతి వ్యక్తులు నేరస్తులుగా జైలు పాలవుతున్నారు.

బాగా చదువుకున్న వారు, డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వారు కూడా నేరస్తుల జాబితాలో వుండటం బాధాకరం.తాజాగా వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని మెయిల్, వైర్ మోసానికి పాల్పడిన భారత సంతతి వ్యక్తికి 51 నెలల జైలు విధించింది న్యాయస్థానం.ఈ మేరకు వర్జీనియాలోని యూఎస్ అటార్నీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

సౌత్ కరోలినాకు చెందిన జీల్ పటేల్ (22) 2020 ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఈ కుట్రను అమలు చేశాడు.దీని ద్వారా భారతదేశంలోని కాల్ సెంటర్ల నుంచి అమెరికాలోని వృద్ధులను టార్గెట్ చేశారు.

కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.ఈ కాల్ సెంటర్లు మొదట్లో బాధితులకు నమ్మకం కలిగించేలా ఆటోమేటెడ్ రోబోకాల్స్‌ ద్వారా ఎమర్జెన్సీ నాటకం ఆడేవి.

బాధితులతో మెల్ల మెల్లగా పరిచయాలు ఏర్పడిన తర్వాత.ఈ ముఠాకు చెందిన కొందరు వ్యక్తులు ఎఫ్‌బీఐ ఏజెంట్లు, డీఈఏ ఏజెంట్లుగా నాటకం ఆడతారు.

తర్వాత తాము చెప్పిన బ్యాంక్ ఖాతాలకు నగదు జమ చేయించుకుంటారు.

ఈ ముఠా కోసం పనిచేస్తున్న కొరియర్‌లు బాధితుల నుంచి దొంగిలించిన మొత్తంలో కొంత భాగాన్ని తమ వద్ద వుంచుకుని మిగిలిన మొత్తాన్ని భారత్‌లోని కాల్ సెంటర్ల ఆపరేటర్‌లకు పంపుతారు.అలా రిచ్‌మండ్‌కు చెందిన సన్నీ పటేల్ పలు రాష్ట్రాల్లో కొరియర్ సెల్‌లను నిర్వహించేవాడు.దీని ద్వారా ఇతను 120 మంది బాధితుల నుంచి 3 మిలియన్ డాలర్ల మొత్తాన్ని వసూలు చేశాడు.

ఈ నేరానికి గాను పటేల్‌కు 2020 ఏప్రిల్‌లో పదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.ఇక మిచిగాన్, సౌత్ కరోలినాలో వున్న ఇద్దరు వేర్వేరు 80 ఏళ్ల బాధితుల నివాసాలకు జీల్ పటేల్ డీఈఏ అధికారి ముసుగులో వెళ్లి నేరుగా నగదు వసూలు చేసినట్లు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో తేలింది.

ఇదిలావుండగా.కొద్దిరోజుల క్రితం పబ్లిక్ కంపెనీలపై తప్పుడు ప్రచారానికి పాల్పడి అక్రమంగా లాభాలు ఆర్జించిన భారత సంతతి వ్యక్తి కుట్ర అమెరికాలోకి వెలుగులోకి వచ్చింది.యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్ (ఎస్ఈసీ) ఇతని గుట్టును రట్టు చేసింది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

నిందితుడు పబ్లిక్ కంపెనీలపై దాదాపు 100కి పైగా తప్పుడు పుకార్లను వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించినట్లుగా తేల్చింది.జార్జియా రాష్ట్రం కమ్మింగ్‌కు చెందిన మిలన్ వినోద్ పటేల్ సహా పథకంలో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులపై ఎస్ఈసీ పలు అభియోగాలను మోపింది.

తాజా వార్తలు