స్కూళ్లో చేర్చుతామని .. అమెరికా తీసుకొచ్చి వెట్టిచాకిరీ, భారతీయ జంటకు జైలుశిక్ష

పాఠశాలలో చేర్పిస్తానని మాయమాటలు చెప్పి అమెరికా తీసుకొచ్చి మూడేళ్ల పాటు తమ గ్యాస్ స్టేషన్‌లో, కన్వీనియన్స్ స్టోర్‌లో వెట్టిచాకిరీ చేయించినందుకు గాను భారతీయ అమెరికన్‌ జంటకు అమెరికా కోర్ట్ జైలు శిక్ష విధించింది.నిందితులను 31 ఏళ్ల హర్మన్ ప్రీత్ సింగ్‌, కుల్బీర్ కౌర్ ( Harman Preet Singh, Kulbir Kaur )(43)గా గుర్తించారు.

అతనికి 135 నెలలు (11 సంవత్సరాలు) , ఆమెకు 87 నెలలు (7 ఏళ్లు) జైలు శిక్షతో పాటు బాధితుడికి, అతని బంధువుకు 2,25,210.76 డాలర్లు (భారత కరెన్సీలో 1.87 కోట్లు ) చెల్లించాలని ఆదేశించింది.కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.బాధితుడు ఆ సమయంలో మైనర్‌గా వున్నాడు.2018లో అతనిని పాఠశాలలో చేరేందుకు సహాయం చేస్తామని ఈ జంట హామీ ఇవ్వడంతో బాధితుడు అమెరికాకు వచ్చాడు.ఇక్కడికి రాగానే బాలుడి ఇమ్మిగ్రేషన్ పత్రాలను( Immigration documents ) లాక్కొని వారిద్దరూ పనిలో పెట్టినట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.

బాలుడిని దుకాణం లోపల వున్న కార్యాలయంలో రోజుల తరబడి బలవంతంగా పడుకోబెట్టారు.కనీసం ఆహారం కూడా పెట్టకుండా, ఇండియాకు వెళ్లిపోతానంటే లేనిపోనివి చెప్పి మరింతగా భయపెట్టారు.

చివరికి బాధితుడు తన ఇమ్మిగ్రేషన్ పత్రాలను ఇవ్వాల్సిందిగా బతిమలాడగా కనీసం జాలి లేకుండా హర్మన్ ( Harman )అతనిని చెప్పుతో కొట్టినట్లు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.అక్కడితో ఆగకుండా ఒక్కరోజు సెలవు తీసుకుని బయటకు వెళ్తానంటే తుపాకీతో బెదిరించినట్లుగా పేర్కొన్నారు.ఈ బలవంతపు వెట్టిచాకిరి 2018 మార్చిలో ప్రారంభమై.2021 మే వరకు కొనసాగినట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.స్టోర్‌లో క్లీనింగ్ చేయించడం, వంట చేయడం, స్టోర్ చేయడం, నగదు రిజిస్టర్, స్టోర్ రికార్డులను నిర్వహించడం వంటి వాటితో సహా రోజుకు 12 నుంచి 17 గంటల పాటు బాలుడితో వెట్టి చాకిరీ చేయించారని రికార్డులు చెబుతున్నాయి.

అమెరికా న్యాయశాఖలోని పౌర హక్కుల వినియోగానికి చెందిన అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్( Assistant Attorney General Kristen Clark ) మాట్లాడుతూ.సింగ్ దంపతులు బాధితుడి నమ్మకాన్ని, అమెరికాలో పాఠశాలలో చదువుకోవాలనే అతని కోరికను దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితుడిని శారీరికంగా, మానసికంగా వేధించారని తమ స్వార్ధ ప్రయోజనాల కోసం అతనిని పనిలో పెట్టుకున్నారని క్లార్క్ తెలిపారు.

Advertisement
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

తాజా వార్తలు