భార్య హత్యకి కుట్ర...ఇండో అమెరికన్ జైలుపాలు..!!!  

భారత సంతతి అమెరికన్ తన ప్రియురాలితో కలిసి మాజీ భార్యని చంపే ప్లాన్ వేశారు. అయితే ఈ ప్లాన్ ఫెయిల్ అవడంతో కటకటాల పాలయ్యారు. ఇంతకీ వీళ్ళిద్దరూ పోలీసులకి ఎలా దొరికారు అంటే. నర్సన్ అనే భారత సంతతి వ్యక్తికి 1995లో పెళ్లయింది. వారికో కొడుకు, కూతురు ఉన్నారు. అతడు 2011లో భార్య తో గొడవపడి విడిపోవడం జరిగింది. ఆస్తి పంపకాల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో విడాకుల కేసు ఇంకా కోర్టులోనే ఉంది.

గతేడాది మే నెలలో వేరే కేసులో నర్సన్ మిడిల్‌సెక్స్ కౌంటీ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు మరో ఖైదీని పరిచయం చేసుకొని తన భార్య హత్యకు కుట్ర పన్నాడు. నర్సన్ గత ఆగస్టులో పోలీసు కస్టడీ నుంచి బయటకి వచ్చిన తరువాత తన ప్రియురాలు సంధ్యారెడ్డి తో కలిసి న్యూజెర్సీలోని ఓ ప్రదేశంలో హత్య పధకం రచించారు.

Indian American Couple Charged With Murder-for-hire-Indian-american Narsan Lingala Plotted To Kill Wife Sandya Reddy

Indian American Couple Charged With Murder-for-hire

ఈ హత్యకి గాను సుమారు ఐదు నుంచీ పది వేల డాలర్లకు బేరం కుదుర్చుకున్నారు అయితే వీరి ఇద్దరికీ తెలియకుండా ఆ పోలీసు వారి సంభాషణని వీడియో రూపంలో తీశాడు..ఆ వెనువెంటనే పోలీసులు అతడిని , సంధ్య రెడ్డి ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు..తన భార్య హత్య గురించి పోలీసుకే చెప్పి సుపారి మాట్లాడుకోవడంతో కటకటాలు పాలయ్యారు.