యూఎస్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్‌ల్లోకి భారతీయులను అనుమతించండి : ఇండో అమెరికన్ వ్యాపారవేత్త

అమెరికాలోని డిఫెన్స్ ప్రాజెక్ట్‌ల్లో పనిచేసేందుకు భారతీయులను అనుమతించాలని కోరారు భారత సంతతికి చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్, మోంటా విస్టా క్యాపిటల్ జనరల్ పార్ట్‌నర్ వెంకటేశ్ శుక్లా.

త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ) అమెరికా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.

ద్వైపాక్షిక సంబంధాలకు ఊతమివ్వడంతో పాటు నూతన ఆవిష్కరణల వ్యయాన్ని తగ్గించేలా ఇరుదేశాలు కృషి చేయాలన్నారు.మోడీ అమెరికాలో అడుగుపెట్టిన తక్షణం ఈ విషయాన్ని ప్రస్తావించాలని వెంకటేశ్ కోరారు.

భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అమెరికా రక్షణ రంగ ద్వారాలు తెరవడం ద్వారా డిఫెన్స్ సెక్టార్‌లో భద్రతా లోపాలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ చర్య ద్వైపాక్షిక సంబంధాలకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుందని వెంకటేశ్ ( Venkatesh )స్పష్టం చేశారు.

ఇది భారతదేశంలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌‌కు బూస్టప్‌లా పనిచేయడంతో పాటు అమెరికా రక్షణ రంగంలో ఆవిష్కరణల వ్యయాన్ని తగ్గిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

Advertisement

భారతదేశం ప్రస్తుతం ఇన్నోవేషన్స్‌కి గ్లోబల్ హబ్‌గా( global hub for innovations ) దూసుకుపోతోందని.అయితే బ్యూరోక్రాటిక్ నిర్మాణం గజిబిజిగా వున్నందున సంస్కరణలు అవసరమని శుక్లా అభిప్రాయపడ్డారు.స్టార్టప్ ఇన్నోవేషన్‌కు సంబంధించి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా మారడం ఆనందంగా వుందన్నారు.

అయితే ఇక్కడ నిబంధనలు ప్రతిబంధకంగా వున్నాయన్నారు.

భారత్‌లోని ప్రతి ఏజెన్సీ, కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వేరు వేరుగా సొంత చట్టాలను, నిబంధనలను కలిగి వుంటాయని వెంకటేశ్ అభిప్రాయపడ్డారు.ఇదే ఇక్కడ సమస్య అని ఆయన పేర్కొన్నారు.భారతదేశవ్యాప్తంగా బ్రాంచీలను కలిగివున్న ఒక చిన్న స్టార్టప్ .చిన్న చిన్న లావాదేవీలకు కూడా ఆర్‌బీఐకి రిపోర్టింగ్ చేయడం తప్పనిసరి అని వెంకటేశ్ తెలిపారు.దీంతో వ్యవస్థాపకులు దుబాయ్, సింగపూర్‌ల వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇకపోతే.ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

పర్యటనలో భాగంగా ఆయన యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు